iDreamPost
android-app
ios-app

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సయ్యద్‌ సొహెల్‌ ఇంట విషాదం

  • Published Sep 17, 2024 | 5:47 PM Updated Updated Sep 17, 2024 | 5:47 PM

Syed Sohel Ryan: బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సొహెల్‌ సయ్యద్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాలసిన అవసరం లేదు. అయితే తాజాగా నేడు ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Syed Sohel Ryan: బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సొహెల్‌ సయ్యద్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాలసిన అవసరం లేదు. అయితే తాజాగా నేడు ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Published Sep 17, 2024 | 5:47 PMUpdated Sep 17, 2024 | 5:47 PM
బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సయ్యద్‌ సొహెల్‌ ఇంట విషాదం

 సొహెల్‌ సయ్యద్‌.. ఈ పేరు గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. ఈయన బిగ్‌ బాస్‌ సీజన్‌ 4లో కంటెస్టెంట్‌ గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఆ షోలో తన దైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సోహెల్‌ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే బుల్లితెర నుంచి వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చి క్రేజీ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు సోహెల్‌. ఇదిలా ఉంటే.. తాజాగా బిగ్‌ బాస్‌ సోహెల్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సొహెల్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నేడు ఈయన తల్లి అనారోగ్యంతో మరణించారు. అయితే గత కొన్నాళ్లుగా  సొహెల్‌ తల్లి కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతుందట. ఈ క్రమంలోనే.. తన తల్లిని సోహెల్‌ డయాలసిస్ కోసం హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది. దీంతో సొహెల్‌ కుటుంబ సభ్యులు శోకసంధ్రంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే.. సొహెల్‌ సొంతూరు కరీంనగర్. అక్కడే ఆయన తండ్రి సయ్యద్ సలీంతో పాటు తల్లి, తమ్ముడు ఉంటారని సమాచారం. ఈ నేపథ్యంలోనే తన తల్లి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి సొంతూరు కరీంనగర్‌కి తీసుకెళ్లి, అక్కడే అంత్యక్రియలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక సొహెల్ కెరీర్ విషయానికొస్తే ‘కొత్తబంగారు లోకం’ సినిమాలో కనీకనిపించని పాత్ర చేశాడు. ఆ తర్వాత ‘జనతా గ్యారేజ్’ సినిమాలో కూడా సైడ్ క్యారెక్టర్‌లో కనిపించాడు. కానీ, వీటన్నింటితో రాని క్రేజ్‌  బిగ్ బాస్ సీజన్‌ 4లో కంటెస్టెంట్‌ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే హీరోగా లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు.

 

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş