Uppula Naresh
Uppula Naresh
రెండేళ్లకొకసారి జరిగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (TFCC)ఎన్నిక సాధారణ ఎన్నికల వాతావరణాన్ని తలపించాయి. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ అధ్యక్ష ఎలక్షన్స్ లో నిర్మాత దిల్ రాజు, సీ. కళ్యాణ్ పోటీ పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీ, నటులు చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 వరకు కొనసాగింది. అయితే ఆదివారం ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఎన్నడు లేని విధంగా ఈ సారి పోలింగ్ జరిగాయి. చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మండమైన ఎలక్షన్ జరిగాయి. ఇది మా అన్నదమ్ముల మధ్య చిన్న సరదా పోటీ. ఎవరు గెలిచినా మా వాళ్లే, కానీ అందరూ మంచి వాళ్లను ఎన్నుకుంటారు. మా వాళ్లు వెనకాల బ్యాక్ గ్రౌండ్ చూడకుండా నిజాయిగా పని చేసేవాళ్లను ఎన్నుకుంటారు. మంచి శుభ సూచికం, ఈ సారి మంచి కమిటీతో ఉత్సాహంగా పని చేయాలని అనుకుంటున్నాం. గెలిచే వాళ్లు ఎవరో నాకు తెలుసు, వారికి నా అభినందనలు, ఓడిపోయిన వారికి బెస్ట్ ఆఫ్ లక్ అంటూ బండ్ల గణేష్ అన్నారు. అయితే, బండ్ల గణేష్ చేసిన తాజా వ్యాఖ్యలపై అందరూ చర్చించుకుంటున్నారు. TFCC ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో నాకు తెలుసున్న బండ్ల గణేష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పొలిటికల్ ఎంట్రీపై ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎక్కడైనా గెలుస్తానంటూ..!