iDreamPost
android-app
ios-app

మైత్రి మేకర్స్ , దిల్ రాజు కలిసిపోయారట.. అందుకోసమేనా..!

  • Published Oct 23, 2024 | 3:40 PM Updated Updated Oct 23, 2024 | 3:40 PM

పండుగ సమయంలో దిల్ రాజు , మైత్రి సంస్థ మధ్య పోరు జరుగుతూనే ఉంటుంది. కొన్ని సార్లు సినిమాల కంటే కూడా నిర్మాతల మధ్య మాటల యుద్ధమే ఎక్కువ అవుతుంది. చివరకు వారిలో ఎవరో ఒకరు వెనకడుగు వేస్తారు. కానీ ఈ పోరు ఇప్పట్లో ఆగేలా లేదని గతంలో చాలానే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ లో ఓ కొత్త గాసిప్ వినిపిస్తుంది.

పండుగ సమయంలో దిల్ రాజు , మైత్రి సంస్థ మధ్య పోరు జరుగుతూనే ఉంటుంది. కొన్ని సార్లు సినిమాల కంటే కూడా నిర్మాతల మధ్య మాటల యుద్ధమే ఎక్కువ అవుతుంది. చివరకు వారిలో ఎవరో ఒకరు వెనకడుగు వేస్తారు. కానీ ఈ పోరు ఇప్పట్లో ఆగేలా లేదని గతంలో చాలానే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ లో ఓ కొత్త గాసిప్ వినిపిస్తుంది.

  • Published Oct 23, 2024 | 3:40 PMUpdated Oct 23, 2024 | 3:40 PM
మైత్రి మేకర్స్ , దిల్ రాజు కలిసిపోయారట.. అందుకోసమేనా..!

దిల్ రాజు , మైత్రి సంస్థ పోటా పోటీ.. మైత్రి మూవీస్ Vs దిల్ రాజు.. అని కొంతకాలంగా వీరిద్దరి గురించి ఎదో ఒక వార్త చూస్తూనే ఉన్నాము. పండుగ సమయంలో వీరిద్దరి మధ్య పోరు జరుగుతూనే ఉంటుంది. కొన్ని సార్లు సినిమాల కంటే కూడా నిర్మాతల మధ్య మాటల యుద్ధమే ఎక్కువ అవుతుంది. చివరకు వారిలో ఎవరో ఒకరు వెనకడుగు వేస్తారు. కానీ ఈ పోరు ఇప్పట్లో ఆగేలా లేదని గతంలో చాలానే వార్తలు వచ్చాయి. జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రేక్షకులు కూడా వీరి మధ్య వార్ తప్పదని అనుకున్నారు. అయితే ఎదుటి వారితో పోటీ పడడం మంచిదే అయినా కూడా.. ఏ రంగంలోను  శాశ్వత పోటీ అనేది మాత్రం ఉండకూడదు . ముఖ్యంగా సినీ ఫీల్డ్ లో అలా ఉండడం వలన చాలా నష్ట పోవాల్సి వస్తుంది.

ఏడాది నుంచి మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ చెడుగుడు ఆడిస్తుంది. వరుసగా సినిమాలను పంపిణీ చేస్తూ ఎగ్జిబిటర్స్ ను దగ్గర చేసుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఈ సంస్థ బలంగా నిలదొక్కుకుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆసియన్ సునీల్ , సురేష్ బాబు కలిసి ఆసియన్ సురేష్ అనే సంస్థను స్టార్ట్ చేశారు. అది కూడా మంచి స్పీడ్ మీదే ఉంది. వరుసగా సినిమాలు కొనడం , పంపిణి చేయడం లాంటివి చేస్తుంది. పైగా తనకు నచ్చిన సినిమాలు ఉంటె అప్పుడప్పుడు శిరీష్ కూడా జాయిన్ అవుతూ ఉంటాడనే టాక్ కూడా ఉంది. ఇక ఈ మూడు పంపిణి సంస్థలు నైజాంలో వచ్చిన దగ్గర నుంచి.. మీడియం, చిన్న సినిమాల నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ లో ఓ కొత్త గాసిప్ వినిపిస్తుంది. శిరీష్ రెడ్డి, మైత్రి సంస్థ కలిసి ఓ అండర్ స్టాండింగ్ వచ్చారని.. ఇక నుంచి అనవసరమైన పోటీలకు పోకుండా.. ఒకరికొకరు సహకరించుకుంటాం అని చెప్పినట్లు ప్రొడ్యూసర్స్ సర్కిల్ లో టాక్ నడుస్తుంది. శిరీష్ దగ్గర ప్రస్తుతం గేమ్ ఛేంజర్, NBK 109 లాంటి సినిమాలు ఉన్నాయి. మైత్రి దగ్గర పుష్ప2 తో పాటు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అందుకే ఇక ముందు ఈ రెండు వర్గాలు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ.. ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యాయట. ఇదే విషయాన్నీ శిరీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. తమకు థియేటర్స్ , సినిమాలు కావాలంటే వారు ఇస్తారని.. వాళ్లకు కావాలంటే తాము ఇస్తామని.. కలిసిపోవడం అంటూ ఏమి ఉండదు కానీ, ఎవరి వ్యాపారంలో వారు కలిసి ముందుకు వెళ్తాము అని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.