iDreamPost
android-app
ios-app

అఖండ 2లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ

  • Published Aug 12, 2024 | 1:13 PM Updated Updated Aug 12, 2024 | 1:13 PM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో త్వరలోనే వీరిద్దరూ అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాగా, ఈ సినిమాలో బాలయ్య సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో త్వరలోనే వీరిద్దరూ అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాగా, ఈ సినిమాలో బాలయ్య సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

  • Published Aug 12, 2024 | 1:13 PMUpdated Aug 12, 2024 | 1:13 PM
అఖండ 2లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా ‘అఖండ’. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించారు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై దద్దరిల్లిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో  బాలయ్య నటనకు థియేటర్స్ లో ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించాయనే చెప్పవచ్చు.

ఇకపోతే అఖండలో బాలకృష్ణ రెండు క్యారెక్టర్స్ లో నటించగా.. అందులో అఘెర పాత్ర సినిమా మొత్తానికే హైలెట్ గా  నిలిచింది. దీంతో ఈ సినిమా విడుదలై చాలా రోజుల వరకు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే ఎక్కువగా చర్చించుకున్నారు. అయితే భారీ హిట్ అందుకున్న ఈ సినిమా త్వరలోనే ‘అఖండ-2’ గా ప్రేక్షకుల ముందకు రాబోతుందనే విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పై ఇప్పటికే  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలోని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

Katrina Kaif in akhanda movie 2

మరోసారి బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న అఖండ2 పై ఆడియోన్స్ కు భారీగా అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ దాదాపు రెడీ కావడంతో.. ప్రస్తుతం నటీ, నటుల ఎంపిక చేసే పనిలో బోయపాటి బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మేకర్స్  ఎక్కువగా బాలీవుడ్ నటీ, నటులను తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే అఖండ-2 లో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఇప్పుడు అఖండ2లో బాలయ్య సరసన ‘కత్రినా కైఫ్’ నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజందో తేేలియదు కానీ, ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండాల్సిందే. ఇకపోతే వీరిద్దరూ గతంలో అల్లరి పిడుగు అనే చిత్రంలో కలిసి నటించారు. ఒకవేళ అఖండ2లో నిజంగా కత్రినా నటిస్తున్నట్లయితే మళ్లీ 20 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ తెర పై కనిపించనున్నారు. మరీ, అఖండ2 లో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ నటిస్తుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet