ఇండస్ట్రీలో ఒక్కోసారి సెలబ్రిటీల విషయంలో జరగనివి జరిగినట్లుగా.. అననివి అన్నట్టుగా ప్రచారం చేస్తుంటారు. ఇది ప్రత్యేకంగా ఒకరి విషయంలో జరుగుతుందని కాదు. దాదాపు అందరి గురించి అప్పుడప్పుడు తప్పుడు ప్రచారాలు జరుగుతుంటాయి. అయితే.. రెగ్యులర్ గా వార్తల్లో లేదా వివాదాలలో కనిపించే వారిపై ప్రచారం జరిగిందంటే అది వేరు. అసలు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా.. తమ పని తాము చేసుకునే వారిపై చర్చలు జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం దర్శకదిగ్గజం రాజమౌళి గురించి అలాంటి ప్రచారమే జరుగుతుంది. అదికూడా బాలీవుడ్ మీడియాలో.. రాజమౌళి ఆమిర్ ఖాన్ యాక్టింగ్ ని కామెంట్ చేశాడని అంటున్నారు.
అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్.. హాలీవుడ్ ‘ఫారెస్ట్ గంప్’ మూవీని ‘లాల్ సింగ్ చద్దా’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా నిరాశపరిచింది. దీంతో హీరో ఆమిర్ ఖాన్ కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంటానని విరామం ప్రకటించాడు. అయితే.. “లాల్ సింగ్ చద్దా మూవీ ప్లాప్ అవ్వడానికి ఆమిర్ ఖాన్ ఓవర్ యాక్టింగే” అని దర్శకుడు రాజమౌళి అన్నట్లు.. ఆమిర్ కజిన్, డైరెక్టర్ మన్సూర్ ఖాన్ తెలిపాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
అందులో నిజానిజాలు ఏంటనేది తెలుసుకోకుండా.. దొరికింది సందని కాంట్రవర్సీ క్రిటిక్ KRK చేసిన రచ్చ మరింత చర్చలకు దారితీసింది. “ఇండియన్ ఇండస్ట్రీకి పలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందించిన డైరెక్టర్ రాజమౌళి లాంటివారే పనితీరును విమర్శించినప్పుడు.. ఆమిర్ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.” అని మన్సూర్ మన్సూర్ ఖాన్ చెప్పినట్లు ఆ వార్త సారాంశం. అయితే.. ఈ వార్తను రెడ్డిట్ అనే సంస్థ ప్రముఖ న్యూస్ ఏజెన్సీల నుండి సమాచారం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇప్పుడు కేఆర్కే మధ్యలోకి వచ్చి.. రాజమౌళిపై కామెంట్స్ చేయడం గమనార్హం. లాల్ సింగ్ చద్దా ప్రివ్యూ చూసి రాజమౌళి మాస్టర్ పీస్ అన్నాడని గతంలో కేఆర్కే ట్వీట్ చేశాడు. కానీ.. ఇప్పుడు రాజమౌళిని అబద్దాలకోరు, కాపీ మాస్టర్ అంటూ కామెంట్స్ చేసి షాకిచ్చాడు. మరి రాజమౌళి అసలు అన్నాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఆమిర్ ఖాన్ ఇప్పటిదాకా తదుపరి సినిమా ప్రకటించలేదు. ఫర్హాన్ అక్తర్‌తో ‘కాంపియోన్స్’ రీమేక్ కోసం చర్చలు జరుపుతున్నట్లు టాక్.
This is the proof, how big liar is copy master @ssrajamouli. When he watched film with Aamir khan, then he called it a masterpiece. And now he is saying that Aamir Khan did over acting. I call such liars fraud film makers. https://t.co/ghZKGrVWla
— KRK (@kamaalrkhan) August 18, 2023