ఘనంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి పెళ్లి! సందడి చేసిన ప్రముఖులు!

ఘనంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి పెళ్లి! సందడి చేసిన ప్రముఖులు!

  • Author ajaykrishna Updated - 09:55 AM, Sat - 19 August 23
  • Author ajaykrishna Updated - 09:55 AM, Sat - 19 August 23
ఘనంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి పెళ్లి! సందడి చేసిన ప్రముఖులు!

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇంట ఘనంగా పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహం.. డాక్టర్ ఐశ్వర్యతో జరిగింది. హైదరాబాద్ లో జరిగిన వీరి పెళ్లి వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్యతో ఆగష్టు 18న సిద్ధార్థ్ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. రాత్రి 10:45 గంటలకు గచ్చిబౌలిలోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో గల అన్వయ కన్వెన్షన్స్ లో వివాహం గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం సిద్ధార్థ్, ఐశ్వర్యల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ పెళ్లి వేడుకకు సీఎం కెసిఆర్ తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక టాలీవుడ్ నుండి చాలామంది సెలబ్రిటీలు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో కోట శ్రీనివాస రావు, రాజశేఖర్ జీవిత దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి సుష్మిత, శ్రీకాంత్ ఫ్యామిలీ, సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు, నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు.

Show comments