iDreamPost
android-app
ios-app

ఆ డైరెక్టర్ కారు పంపిస్తా నైట్​ రమ్మన్నాడు.. స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు!

  • Published May 01, 2024 | 6:39 PM Updated Updated May 01, 2024 | 6:39 PM

మెస్మరైజింగ్ యాక్టింగ్​తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న స్టార్ నటి సంచలన ఆరోపణలు చేశారు. ఆ డైరెక్టర్ కారు పంపిస్తా నైట్ రమ్మన్నాడని తెలిపారు.

మెస్మరైజింగ్ యాక్టింగ్​తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న స్టార్ నటి సంచలన ఆరోపణలు చేశారు. ఆ డైరెక్టర్ కారు పంపిస్తా నైట్ రమ్మన్నాడని తెలిపారు.

  • Published May 01, 2024 | 6:39 PMUpdated May 01, 2024 | 6:39 PM
ఆ డైరెక్టర్ కారు పంపిస్తా నైట్​ రమ్మన్నాడు.. స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు!

ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ టూ ఉద్యమం రేపిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. అప్పట్లో ఈ ఉద్యమం వల్ల చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైOగిక వేధింపుల గురించి బయటకొచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో చాలా మంది ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ మేకర్స్ బాగోతాలు బయటపడ్డాయి. అయితే ఆ తర్వాత ఎందుకో గానీ మీ టూ చల్లబడిపోయింది. కానీ ఈ మధ్య తిరిగి నటులు తమకు జరిగిన అవమానాలు, వేధింపుల గురించి నోరు విప్పి మాట్లాడుతున్నారు. దేనికీ భయపడకుండా తమ కెరీర్​ల గురించి డిస్కస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్టార్ నటి తన కెరీర్ స్టార్టింగ్​లో జరిగిన ఓ ఘటన గురించి చెప్పుకొచ్చారు. ఒక డైరెక్టర్ వల్ల తాను పడిన ఇబ్బందుల గురించి పంచుకున్నారు.

ఆమె ఓ సీనియర్ నటి. మూడున్నర దశాబ్దాల కిందే చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఎన్నో వందల సినిమాల్లో నటించారు. మూవీస్​తో పాటు టీవీ షోల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్​టైన్ చేశారు. కానీ కెరీర్ ఆరంభంలోనే ఓ డైరెక్టర్ వల్ల తాను తీవ్రంగా ఇబ్బంది పడ్డాడని అన్నారు. ఆ నటి మరెవరో కాదు.. ఉపాసన సింగ్. హిందీ మూవీస్ చూసేవారికి ఆమెది పరిచయం అక్కర్లేని పేరు. 1988లో వచ్చిన ‘బాయి చలీ ససురాయి’ అనే రాజస్థానీ చిత్రంతో ఆమె కెరీర్​ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత హిందీతో పాటు పంజాబీ సినిమాలు కూడా చేస్తూ పోయారు. హీరోయిన్​గా కూడా కొన్ని మూవీస్ చేసినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్​గానే ఆమె మంచి పేరు సంపాదించారు. 1997లో రిలీజ్ అయిన ‘జుదాయి’ ఫిల్మ్​ ద్వారా ఆమె క్రేజ్ బాగా పెరిగింది.

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఉపాసన సింగ్ మాట్లాడుతూ తన కెరీర్ తొలినాళ్ల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సౌత్ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి షేర్ చేసుకున్నారు. ఒక సౌత్ డైరెక్టర్ తనను అనిల్ కపూర్ సరసన నటింపజేస్తానని చెప్పాడని.. అనంతరం ఆయన తనను నైట్ హోటల్‌లో మీటింగ్‌కు పిలిచాడని ఉపాసన తెలిపారు. అప్పటికి తన వయస్సు 17 సంవత్సరాలని చెప్పుకొచ్చారు. ఏం చెప్పాలో అర్థం కాలేదని, తర్వాతి రోజు వస్తానని చెప్పానని పేర్కొన్నారు. అప్పుడు కారు పంపిస్తానని ఆ డైరెక్టర్ అన్నాడని.. దీంతో ఆయన మాటలు అర్థం చేసుకొని తీవ్రంగా మందలించానని వివరించారు. తన గురించి ఇలా ఎలా ఆలోచించావంటూ సీరియస్ అయ్యానని.. ఇది జరిగిన తర్వాత ఏడు రోజుల వరకు ఇంటి నుంచి బయటకు రాలేదని.. ఏడుస్తూనే ఉన్నానని ఉపాసన వ్యాఖ్యానించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş