Venkateswarlu
గత నెలలో టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటుడు చంద్రమోహన్.. బహుభాషా నటి సుబ్బలక్ష్మి, తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ మారిముత్తు, మాలీవుడ్ నటి రెంజూషా చనిపోయారు..
గత నెలలో టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటుడు చంద్రమోహన్.. బహుభాషా నటి సుబ్బలక్ష్మి, తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ మారిముత్తు, మాలీవుడ్ నటి రెంజూషా చనిపోయారు..
Venkateswarlu
భారత చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెలలో టాలీవుడ్‌తో పాటు ఇతర భాషలకు చెందిన ప్రముఖులు కొందరు కన్నుమూశారు. తెలుగు సీనియర్ నటుడు చంద్రమోహన్ మధుమేహం, కిడ్నీల సమస్య, హృద్రోగంతో బాధపడుతూ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం విషమించింది. డాక్టర్లు ఆయన్ని బ్రతికించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. నవంబర్ 11న చంద్రమోహన్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
ఆ తర్వాత కొద్దిరోజులకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. కర్ణన్ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించిన మారి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన మారిముత్తు మృతి చెందారు. అంతకు ముందు మాలీవుడ్‌కు చెందిన టీవీ, సినిమా నటి రెంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఇలా నవంబర్ చేదును మిగిల్చింది. డిసెంబర్ మొదల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
డిసెంబర్ ఒకటవ తేదీ ప్రముఖ బహుభాషా నటి సుబ్బలక్ష్మి చనిపోయారు. వయో భార సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. గత కొద్దిరోజుల పాటు ఆమె అక్కడ చికిత్స పొందారు. 87 ఏళ్ల వయసులో సుబ్బలక్ష్మి తుది శ్వాస విడిచారు. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. ఈ విషాదాలను మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మహమూద్ చనిపోయారు. గత కొన్నేళ్లుగా ఆయన కడుపులో క్యాన్సర్‌తో బాధపడుతూ ఉన్నారు. అయితే, తనకు క్యాన్సర్ ఉందన్న సంగతి ఆయనకు 18 రోజుల క్రితమే తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని టాటా మెమొరియల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. క్యాన్సర్ పోర్త్ స్టేజీలో ఉండటంతో బతికే ఛాన్సులు తక్కువని డాక్టర్లు చేతులు ఎత్తేశారు. పోర్త్ స్టేజిలో చికిత్స, కీమోథెరపీ చేయటం చాలా నొప్పిగా ఉంటుందని వారు తెలిపారు. ఇంట్లోనే ఉంచి చికిత్స చేస్తామని చెప్పారు.
ఇక, అప్పటినుంచి ముంబై, ఖార్‌లోని ఇంట్లోనే మహమూద్‌కు చికిత్స అందుతోంది. ఈ తెల్లవారుజామున ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. 2.15 గంటల ప్రాంతంలో మహమూద్ చనిపోయారు. ఈ విషయాన్ని మహమూద్ కుటుంబసభ్యులు అధికారికంగా ధ్రువీకరించారు. కాగా, మహమూద్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. మహాబ్బత్ జిందగీ హై అనే సినిమాతో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన అసలు పేరు నయిమ్ సయ్యద్. బాలీవుడ్ దిగ్గజ హాస్య నటుడు మహమూద్.. నయిమ్ పేరును జూనియర్ మహమూద్‌గా మార్చారు. అప్పటినుంచి ఆ పేరుతోనే పిలవబడుతున్నారు. మరి, ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.