iDreamPost
android-app
ios-app

Bindu Madhavi చెప్పిన‌ట్లే టైటిల్ గెలిచింది, బాలయ్య సినిమాలో ఛాన్స్ ప‌ట్టేసింది

  • Published May 22, 2022 | 10:16 AM Updated Updated May 22, 2022 | 10:16 AM
  • Published May 22, 2022 | 10:16 AMUpdated May 22, 2022 | 10:16 AM
Bindu Madhavi చెప్పిన‌ట్లే టైటిల్ గెలిచింది, బాలయ్య సినిమాలో ఛాన్స్ ప‌ట్టేసింది

ఎందుకు బిగ్ బాస్ కి వ‌చ్చావు? గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున అడిగిన‌ప్పుడు, తెలుగు సినిమాల్లో మ‌ళ్లీ న‌టించ‌డానికి అవ‌కాశాల కోస‌మ‌ని చెప్పింది విన్న‌ర్ బిందు మాధ‌వి. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ఓటీటీలో 84 రోజుల పాటు నడిచిన రియాలిటీ షోలో, విన్నర్ గా ట్రోఫీని సాధించింది బిందు మాధవి. బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

బిందుమాధవి కోసం స్పెష‌ల్ గా ఓ కేర‌క్ట‌ర్ ను డిజైన్ చేస్తాన‌ని, అన్నీ అనుకున్నట్టు జరిగితే. బాలయ్య సినిమాలోనే ఆ పాత్ర ఉండేలా చూస్తాన‌ని స్టార్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి హామీ ఇచ్చాడు. అదే జ‌రిగితే బిందు మాధ‌వికి టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన‌ట్లే.

బిగ్ బాస్ నాన్ స్టాప్ డిస్నీ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 27న మొదలై, బిందు మాధ‌వి విన్న‌ర్ గా ప్ర‌క‌టించ‌డంతోనే ముగిసింది. ఈ రియాలిటీ షో కోసం అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ సెట్ వేశారు.

బిగ్ బాస్ హౌజ్ లోకి చాలామంది సీనియ‌ర్లు, సోష‌ల్ మీడియాలో ఫేమస్ అయిన‌ కంటెస్టెంట్లు ప్రవేశించగా, టాప్-5కి బిందుమాధవితో పాటు అరియానా, అఖిల్ సార్థక్, యాంకర్ శివ, మిత్రా శర్మ నిలిచారు. మిత్రాశ‌ర్మ ఒక‌రేంజ్ కి వ‌చ్చి ఆగిపోయింది. అరియాన్ మొద‌ట్లో చూపించిన దూకుడు ఆ త‌ర్వాత కొన‌సాగించ‌లేక‌పోయింది.

బిందుమాధవి, అఖిల్ మధ్య గట్టిపోటీ త‌ప్ప‌లేదు. అఖిల్ గెలిచేస్తాడని ఒకానొక స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో అనుకున్నారు. చివ‌రి రెండు వారాల్లో బిందు మాధ‌వి దుమ్ముదులిపేసింది. కోలీవుడ్ నుంచి ఓట్లుకూడా ప‌డ్డాయి. అలా బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా బిందుమాధవి నిలిచింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigboss