Krishna Kowshik
అట్లీ- ఇళయ దళపతి కాంబోలో వచ్చిన హిట్ చిత్రాల్లో ఒకటి బిగిల్. తెలుగులో విజిల్ పేరుతో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో నయన తార హీరోయిన్. ఈ మూవీలో ఈమె కాకుండా ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారో తెలుసా..?
అట్లీ- ఇళయ దళపతి కాంబోలో వచ్చిన హిట్ చిత్రాల్లో ఒకటి బిగిల్. తెలుగులో విజిల్ పేరుతో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో నయన తార హీరోయిన్. ఈ మూవీలో ఈమె కాకుండా ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారో తెలుసా..?
Krishna Kowshik
కోలీవుడ్ టాప్ హీరో ఇళయ దళపతి విజయ్, యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో మూడు చిత్రాలు వచ్చాయి. తేరీ, మెర్సల్, బిగిల్. ఈ మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. తమిళంలోనే కాదు తెలుగు కూడా పోలీసోడు, అదిరింది, విజిల్ పేర్లతో డబ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. తేరీ, మెర్సల్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాలుగా నిలిస్తే.. బిగిల్ మాత్రం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కి క్లాసిక్ హిట్ అందుకుంది. ఇందులో విజయ్ డ్యూయల్ రూల్ పోషించాడు. అలాగే ఫుట్ బాల్ కోచ్‌గా నటించాడు. ఉమెన్స్ జట్టుకు కోచింగ్ ఇవ్వడంతో పాటు విజయంలో కీలక పాత్ర పోషిస్తాడు. కాగా, ఇందులో నయనతార హీరోయిన్. అయితే ఇందులో మరో విశేషమేమిటంటే.. లేడీ సూపర్ స్టార్ మాత్రమే కాదు ఈ స్టార్ హీరోయిన్స్ కూడా నటించారని తెలుసా..? వాళ్లెవరు అంటే..?
విజిల్ మూవీలో ఉమెన్ ఫుట్ బాల్ టీం కెప్టెన్‌గా కీర్తన పాత్రలో నటించిన అమ్మాయి.. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న అమృతా అయ్యర్. ఈ మూవీకి ముందు తమిళంలో డజనుకు పైగా సినిమాలు చేసింది. తెనాలి రామన్, లింగ, పోకిరీ రాజా, తేరీ, కాళీ, బిగిల్లో సైడ్ క్యారెక్టర్ చేసింది. వణక్కం దా మాపిల్లై, లిఫ్ట్, కాఫీ విత్ కాదల్ చిత్రాల్లో మెయిన్ రోల్స్ చేసింది. కానీ ఆమెకు గుర్తింపు తెచ్చింది మాత్రం హనుమాన్ మూవీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే పోచమ్మ పాత్రలో నటించిన యాక్ట్రెస్ ఇంద్రజా శంకర్. రోబో శంకర్ కూతురిగా ఇదే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో పాగల్ మూవీలో నటించింది. ప్రస్తుతం మ్యారేజ్ చేసుకుని.. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది. ఇందులో సుమ క్యారెక్టర్‌లో నటించింది ఇంధూజ రవిచంద్రన్. ఈ సినిమాలో అమృతా అయ్యర్ కన్నా పేరు తెచ్చుకుంది.
ఇక ఈ సినిమాకు కీలకంగా మారిన ఇద్దరు నటీమణుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్లు కనిపించేది తక్కువ సమయమే అయినా.. మూవీలో వీరివే కీ రోల్స్. ఆ ఇద్దరే గాయత్రి, అనితా. గాయత్రిగా ప్రముఖ నటి వర్ష బొల్లమ్మ నటించగా.. యాసిడ్ దాడికి గురైన అనితా పాత్రలో రెబా మోనికా జాన్ నటించింది. వర్ష బొల్లమ్మ తమిళంలోనే కాదు తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించింది. చూసీ చూడంగానే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్ మొదలుకుని ఈ ఏడాది ఊరు పేరు భైరవకొనతో అలరించింది. ఇక రెబా మౌనిక జాన్.. బూ బైలింగ్వల్ చిత్రంలో స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకోగా.. సామజవరగమనతో సోలో హిట్ కొట్టింది. మొత్తంగా విజిల్ సినిమా నిండా సుమారు ఐదారుగురు స్టార్ హీరోయిన్స్ ఉన్నారన్న మాట.