iDreamPost
android-app
ios-app

విడాకులకు కారణం అదే! వర్ష బొల్లమ్మ షాకింగ్ స్టేట్మెంట్!

  • Published Jul 22, 2024 | 4:36 PM Updated Updated Jul 22, 2024 | 4:36 PM

Varsha Bollamma: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ గురించి ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ నెటిజన్ విడాకుల పై అడిగిన ప్రశ్నకు షాకింగ్ కామెంట్ చేసింది.

Varsha Bollamma: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ గురించి ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ నెటిజన్ విడాకుల పై అడిగిన ప్రశ్నకు షాకింగ్ కామెంట్ చేసింది.

  • Published Jul 22, 2024 | 4:36 PMUpdated Jul 22, 2024 | 4:36 PM
విడాకులకు కారణం అదే! వర్ష బొల్లమ్మ షాకింగ్ స్టేట్మెంట్!

డైవర్స్.. ఇటీవల కాలంలో ఈ పేరు గట్టిగానే వినిపిస్తుంది. ఎందుకంటే.. ఇప్పుడు వివిధ రంగాల్లో ఉన్నా సెలబ్రిటీ జంటలంతా విడాకుల బాటలో నడుస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా పెళ్లైన ఏడాదికే చాలామంది మధ్య మనస్పర్థాలు రావడంతో.. దింతో ఒకరిని ఒకరూ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోని దూరంగా ఉంటూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక అక్కడికి కొన్ని రోజులకు చట్టబద్ధంగా విడిపోతూ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంటారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో, క్రీడా రంగంలో ప్రముఖ సెలబ్రిటీ జంటలు ప్రేమ వివాహం చేసుకొని, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం తరుచు వింటూ, చూస్తునే ఉన్నాం. అయితే ఇలా చాలామంది పెళ్లిళ్లు చేసుకున్న ఏడాదికే ఎందుకు విడిపోతున్నారనే విషయంపై ఓ నెటిజన్స్ తాజాగా యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ప్రశ్నించగా.. ఈ బ్యూటీ సింపుల్ గా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఇంతకి అదేమిటంటే..

కన్నడ ముద్దుగుమ్మ ‘వర్ష  బొల్లమ్మ’. ఈ పేరు తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఎందకుంటే.. ఈ బ్యూటీ పేరుకు కన్నడ నటి అయిన ఈమె తెలుగు, తమిళ్ భాషలోనే ఎక్కువగా సినిమాల్లో రాణిస్తోంది. అయితే ఈమె మొదటిగా  ‘చూసీ చూడంగానే’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. దీంతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’ చిత్రంలో నటించి మంచి మార్కులు వేసుకుంది. ఈ క్రమంలోనే తలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వర్ష బొల్లమ్మ. ఇదిలా ఉంటే.. సినిమాల్లోనే కాకుండా..  సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈ చిన్నది షాకింగ్ కామెంట్ చేసింది.

Varsha Bollamma

ఈ మేరకు తాజాగా  ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా దీపిక నారాయణ్ భరధ్వాజ్ విడాకులకు కారణం ఏంటీ మీ ఉద్దేశం .? అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు వర్ష.. ‘మ్యారెజ్’ అని  సమాధానం తెలిపింది. దీంతో వర్ష చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారడంతో.. కొంతమది నిటిజెన్స్ ఈ బ్యూటీకి పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరి కొందరూ  మంచి పార్ట్‌నర్‌ దొరికితే విడాకులు ఎందుకు తీసుకుంటారు? జీవితాంతం కలిసికట్టుగా ఉంటారని చెప్తున్నారు. మరి, నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ పై ఈ బ్యూటీ స్పందిస్తుందో లేదో అనేది చూడాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే.. వర్ష బొల్లమ్మ ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ భాషాల్లో సినమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది. కాగా, ఇటీవలే ఈ చిన్నది హీరో సందీప్ కిషన్ తో   ‘ఊరుపేరు భైరవ కోన’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరి, నెటిజన్ విడాకులపై అడిగిన ప్రశ్నకు  వర్ష బొల్లమ్మ చెప్పిన సమాధానం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss