iDreamPost
android-app
ios-app

ఈ చిన్నోడు.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ దర్శకుడు! గుర్తుపట్టారా?

  • Published Jul 12, 2024 | 2:00 AM Updated Updated Jul 12, 2024 | 2:00 AM

ఈ ఫోటోలో స్టైలిష్ గా నిలుచున్న క్యూట్ లిటిల్ వన్ ఎవరో తెలుసా..? ఓటమి ఎరుగని సినీ యోధుడు. అతడితో వర్క్ చేసేందుకు ఊవిళ్లూరుతుంటారు హీరోస్. ఇంతకు ఆ చిన్నారి ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలో స్టైలిష్ గా నిలుచున్న క్యూట్ లిటిల్ వన్ ఎవరో తెలుసా..? ఓటమి ఎరుగని సినీ యోధుడు. అతడితో వర్క్ చేసేందుకు ఊవిళ్లూరుతుంటారు హీరోస్. ఇంతకు ఆ చిన్నారి ఎవరో చెప్పుకోండి చూద్దాం.

  • Published Jul 12, 2024 | 2:00 AMUpdated Jul 12, 2024 | 2:00 AM
ఈ చిన్నోడు.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ దర్శకుడు! గుర్తుపట్టారా?

కలలు అందరూ కంటారు. అవి కొద్ది మంది మాత్రమే సాకారం చేసుకోగలుగుతుంటారు. ఏదీ కావాలని అనుకుంటామో దానిపైనే ఫోకస్ పెడుతూ..తప్పులు సరిచేసుకుంటూ, పడుతూ లేస్తుంటారు. అలాంటి వారిని సక్సెస్ పలకరిస్తూనే ఉంటుంది. అపజయాలను కుంగిపోరు..విజయం వస్తే పొంగిపోరు. విమర్శకులను కూడా తమ పనితోనే సమాధానం చెబుతుంటారు. వారిలో ఈ పిల్లాడు కూడా ఒకడు. దర్శకుడు కావాలని కలలు కనడమే కాదు.. వాటిని ఫుల్ ఫిల్ చేసుకోవడంలో ఎంతో కష్టపడ్డాడు. 19 ఏళ్లకే అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా అవతరించాడు. ఇప్పుడు ఇతడితో సినిమాలు చేసేందుకు ఎవ్రీ ఇండస్ట్రీ టాప్ హీరోస్ ఎదురు చూస్తున్నారు.

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పిల్లాడు.. టాప్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. చిన్న వయస్సులోనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రముఖ దర్శకుడు శంకర్ దగ్గర వర్క్ చేశాడు. తర్వత షార్ట్ ఫిల్మ్స్ తీసి ఫేమస్ అయ్యాడు. తొలి సినిమాతోనే మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇంతకు ఈ చిన్నారి ఎవరంటే.. కోలీవుడ వర్సటైల్ దర్శకుడు అరుణ్ కుమార్ అలియాస్ అట్లీ. ఆర్య, జై, నయనతార, నజీమ్ నజ్రియా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ రాజా రాణి. ఈ మూవీతో దర్శకుడిగా అడుగుపెట్టాడు ఈ యంగ్ డైనమిక్ డైరెక్టర్. ఈ మూవీ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అట్లీ ఫస్ట్ సినిమానే రూ. 50 కోట్లను కొల్లగొట్టింది. ఆ తర్వాత విజయ్, సమంత, అమీ జాక్సన్లతో కలిసి తేరీ తెరకెక్కించాడు. ఇది కూడా సూపర్ డూప్ హిట్. ఏకంగా.. రూ. 150 కోట్లను కొల్లగొట్టింది.

ఆ తర్వాత విజయ్‌తోనే మెర్సల్ తెరకెక్కించాడు. ఇందులో టాప్ హీరోయిన్లు సమంత, కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్ నటించడం విశేషం. స్పోర్ట్ డ్రామాలో వచ్చిన విజిల్ చేసి విజయ్‌కు హ్యాట్రిక్ హిట్ అందించాడు అట్లీ. ఈ సారి కుంభస్థలాన్నే కొట్టాడు అరుణ్ కుమార్. ఏకంగా బాలీవుడ్ బాద్ షాతోనే సెట్ చేసుకున్నాడు. షారూఖ్ ఖాన్‌తో జవాన్ మూవీ తెరకెక్కించి.. ఒక్కసారిగా బీటౌన్ సినీ సెలబ్రిటీలను ఆకర్షించాడు. ఇవే కాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలు తెరకెక్కించాడు. సంగ్లీ, బంగ్లీ కథవా థఓర్, అంధకారం, బేబీ జాన్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం దబాంగ్ 4 ప్రాజెక్ట్ అతడి చేతికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే.. తెలుగు మూలాలున్న నటి క్రిష్ణ ప్రియను వివాహం చేసుకున్నాడు. వీరికో చైల్డ్. ప్రస్తుతం ఈ జంట.. ఇండియన్ టైకూన్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకలకు ఒకేరకమైన అవుట్ ఫిట్ ధరించి.. వార్తల్లో నిలిచారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss