బిగ్ బాస్ టైటిల్ రికార్డులు సృష్టించిన సెన్సేషనల్ విన్నర్ అరెస్ట్..

Bigg Boss Winner Arrest: ఈ మధ్య బిగ్ బాస్ విన్నర్ల చుట్టూ పోలీసులు కేసులు తిరుగుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. తాాజాగా ఓ బిగ్ బాస్ విన్నర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Bigg Boss Winner Arrest: ఈ మధ్య బిగ్ బాస్ విన్నర్ల చుట్టూ పోలీసులు కేసులు తిరుగుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. తాాజాగా ఓ బిగ్ బాస్ విన్నర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

బిగ్ బాస్ రియాలిటీ షోకి వరల్డ్ వైడ్ గా ఎంతో గొప్ప ఆదరణ ఉంది. ఈ షోని వ్యతిరేకించేవాళ్లు ఉన్నారు. సపోర్ట్ చేసే వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. ఆదరణ, ట్రోల్స్ సంగతి పక్కన పెడితే బిగ్ బాస్ షో వల్ల సెలబ్రిటీలు అయినవాళ్లు చాలామందే ఉన్నారు. అలాగే షో వల్ల వచ్చిన క్రేజ్ తో కెరీర్ మిస్ ఫైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఒక విన్నర్ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నాడు. నిజానికి ఇతను టైటిల్ విన్ అవ్వడంతో సోషల్ మీడియాలోనే కాకుండా.. వార్తల్లో కూడా సంచలనంగా మారాడు. తాజాగా పోలీసులు అరెస్టు అవ్వడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు.

బిగ్ బాస్ షో వల్ల సెలబ్రిటీలుగా మారిన వాళ్లు, కెరీర్ డౌన్ లో ఉండగా షోకి వెళ్లి మరోసారి కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ షోకి వెళ్తే సెలబ్రిటీలు అయిపోతారు అనే ముద్ర అయతే ఉంది. అలాగే ఇటీవల ముగిసిన బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2లో వైడల్డ్ కార్డుగా అడుగుపెట్టిన ఎల్విష్ యాదవ్ విన్నర్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ గా వచ్చి విన్నర్ అయిన తొలి కంటెస్టెంట్ గా ఎల్విష్ యాదవ్ రికార్డులు క్రియేట్ చేశాడు. ప్రస్తుతానికి అతను మాత్రం కటకటాల వెనుక ఉన్నాడు. అతడిని పోలీసులు అరెస్టు చేసినట్లు నోయిడా డీసీపీ వెల్లడించారు. ఎల్విష్ యాదవ్ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఎల్విష్ యాదవ్ ని పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఏం జరిగిందంటే?:

ఎల్విష్ యాదవ్ ఒక ప్రముఖ యూట్యూబర్ అతను బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో పాల్గొని విన్నర్ అయ్యాడు. ఆ తర్వాత అతని పాపులారిటీ బాగా పెరిగిపోయింది. అతడిని ఇంటర్వ్యూ చేయాలని చూసిన ఓ యూట్యూబర్ పై ఎల్విష్ యాదవ్ దాడి చేసిన విషయం తెలిసిందే. అతని అనుమతి లేకుండా వీడియోలు తీస్తున్నాడు అంటూ ఆగ్రహంతో యూట్యూబర్ పై దాడికి దిగాడు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఎల్విష్ యాదవ్ పై పాము విషయాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి. గురుగ్రామ్, నోయిడా ప్రాంతాల్లో ఎల్విష్ యాదవ్ రేవ్ పార్టీలకు పాము విషయాన్ని అక్రమంగా సరఫరా చేస్తున్నాడు అంటూ ఆరోపణలు ఉన్నాయి.

పాము విషం అక్రమ రావాణా ఆరోపణల నేపథ్యంలోనే పోలీసులు ఎల్విష్ యాదవ్ ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. ఈ ఆరోపణలను ఎల్విష్ యాదవ్ తీవ్రంగా ఖండించాడు. అంతేకాకుండా అతనిపై వచ్చిన ఆరోపణలు రుజువై దోషిగా తేలితే.. బట్టలు విప్పి కెమెరా ముందు డాన్సులు చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. తనపై నమోదైన కేసు అవాస్తవం అంటూ చెప్పకొచ్చాడు. ప్రస్తుతం అతడిని కోర్టుకు తీసుకెళ్తున్న వీడియో వైరల్ గా మారింది. బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments