P Krishna
Bigg Boss Contestant Gangavva: ‘మై విలేజ్ షో’ఛానల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన గంగవ్వ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తుంది.
Bigg Boss Contestant Gangavva: ‘మై విలేజ్ షో’ఛానల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన గంగవ్వ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తుంది.
P Krishna
ఒకప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవించే గంగవ్వ ‘మై విలేజ్ షో’ అనే ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. 60 ఏళ్ళ వయసులో బుల్లితెర, వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది గంగవ్వ. నటనపై ఏమాత్రం అనుభవం లేకున్నా.. ఆమె మాట్లాడే యాస అందరికీ బాగా నచ్చుతుంది. తెలంగాణ కట్టు, బొట్టుతో గంగవ్వ బుల్లితెరపై పండించే కామెడీ మామూలుగా ఉండదు. అందుకే ఆమె పాపులారిటీ మెచ్చి తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా తీసుకున్నారు. తాజాగా బిగ్ బాస్ గంగవ్వ, మై విలేజ్ షో రాజు పై కేసు నమోదైంది. ఇంతకీ వారు చేసిన నేరం ఏంటీ అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోెకి వెళితే..
గంగవ్వ, యూట్యూబర్ రాజు పై కేసు నమోదైంది. వణ్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ను నిబంధన ఉల్లంఘించారంటూ యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ జగిత్యాల అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం భారత చిలుకను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మే 20, 2022 లో ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్ లో గంగవ్వ చిలుక పంచాంగం అనే వీడియోలో మల్యాల మండలం లంబాడీపల్లిలో గంగవ్వ, రాజు జ్యోతిష్కులుగా నటిస్తూ చిలుకను ఉపయోగించారని గౌతమ్ తెలిపారు. ఇది భారతీయ చిలుకలు వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 షెడ్యూల్ IV కింద వర్గీకరించబడింది. ఈ చట్టం చిలుకల అపహరణ, హింసల నుంచి కాపాడుతుంది. గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన అటవీ రేంజ్ అధికారి (FRO) పి పద్మారావు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. కాగా, కొండగట్టు దేవాలయం సమీపంలోని ఓ వీధిలో ఉండే జ్యోతిష్యుడి దగ్గర నుంచి రాజు ఈ చిలుకను తెచ్చినట్టు వెల్లడైంది.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లో గంగవ్వ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఆమె వయసు రిత్యా టాస్కుల్లో పెద్దా ఆడకపోయినా.. తనదైన కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తుంది.బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడ ఏసీ, వాతావరణం పడకపోవడంతో అనారోగ్యం పాలైంది. దీంతో ఆమెను బిగ్ బాస్ యాజమాన్యం మధ్యలోనే ఇంటికి పంపించివేశారు.నిన్న గంగవ్వకు గుండెపోటు వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. కానీ.. ఇదంతా ఫ్రాంక్ అని బిగ్ బాస్ టాస్క్‌లో ఇదో భాగమని, గంగవ్వకు హార్ట్ ఎటాక్ వస్తే ఇంటి సభ్యులు ఎలా స్పందిస్తారనే కాన్సెప్ట్ తో ఫ్రాంక్ రూపొందించారని వార్తలు వస్తున్నాయి.ఇలాంటి విషయాలు సున్నితమైనవి, సోషల్ మీడియాలో వైరల్ అయితే అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతారని బిగ్ బాస్ యాజమాన్యంపై విమర్శలు వస్తున్నాయి. కాకపోతే ఈ విషయంపై బిగ్ బాస్ టీమ్ అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయలేదు.