iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ బ్యూటీ వాసంతి నిశ్చితార్థం.. వీడియో వైరల్

  • Published Dec 08, 2023 | 12:35 PM Updated Updated Dec 08, 2023 | 12:35 PM

బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయ్యి.. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అలరిస్తున్నారు చాలా మంది నటీమణులు. ఆ కోవకే వస్తుంది మన బ్యూటీ క్వీన్ వాసంతి కృష్ణన్. తన యాంకరింగ్ తో అలరిస్తున్న ఈ చిన్నది.. ఇప్పుడు నూతన అధ్యాయంలోకి అడుగులు వేస్తోంది.

బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయ్యి.. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అలరిస్తున్నారు చాలా మంది నటీమణులు. ఆ కోవకే వస్తుంది మన బ్యూటీ క్వీన్ వాసంతి కృష్ణన్. తన యాంకరింగ్ తో అలరిస్తున్న ఈ చిన్నది.. ఇప్పుడు నూతన అధ్యాయంలోకి అడుగులు వేస్తోంది.

  • Published Dec 08, 2023 | 12:35 PMUpdated Dec 08, 2023 | 12:35 PM
బిగ్ బాస్ బ్యూటీ వాసంతి నిశ్చితార్థం.. వీడియో వైరల్

బుల్లితెరపై యాంకర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. చాలా మంది మహిళా యాంకర్లు తమదైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అటువంటి వారిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది వాసంతి కృష్ణన్. పుష్ప బ్లాక్ బస్టర్ అయిన సమయంలో ‘ఏందీ సామి హిట్టు కొట్టిండ్రు పార్టీ లేదా’ అంటూ రాయలసీమ యాసలో మాట్లాడి అల్లు అర్జున్, సుకుమార్‌ను ఆకట్టుకుని, ఒక్క సారిగా లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఇదే ఇమేజ్‌తో ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 6లో సందడి చేసింది ఈ అమ్మడు. ఇప్పుడు ఈమె మరో నూతన ప్రయాణంలోకి అడుగుపెట్టబోతోంది. అదేనండి ఆమె త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. తాజాగా ఆమె తన ప్రియుడు పవన్ కళ్యాణ్‌తో ఏడడగులు వేయబోతోంది.  ఈ నెల 7న ఆమె నిశ్చితార్థం జరిగింది.

ఏపీలోని వాసంతి స్వస్థలమైన తిరుపతిలో ఆమె ఎంగేజ్ మెంట్ జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడకకు బిగ్ బాస్ ఫ్రెండ్స్, ఇతరులు హాజరై.. సందడి చేశారు. తాజ్ హోటల్లో నిశ్చితార్థ వేడుక జరిగింది. కాగా, ఆమెకు కాబోయే భర్త ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. వారిద్దరూ కొన్నినెలలుగా ప్రేమించుకుని, ఆపై పెద్దలను ఒప్పించి ఒక్కటి కాబోతున్నారు. పవన్ కూడా రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. వీరి నిశ్చితార్ధానికి బిగ్ బాస్ నటీనటులు శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గీతూ రాయల్, ఇనయ సుల్తానా హాజరయ్యారు. త్వరలో వీరి పెళ్లి ఉండబోతోంది. ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకున్న ఉద్దేశంతో బెంగళూరులో ఏవియేషన్ కోర్సును అభ్యసించింది వాసంతి. కానీ ఆమె తర్వాత మోడల్‌గా మారింది.

2019లో సిరి సిరి మువ్వలు అనే సీరియల్‌తో బుల్లితెరపై అడుగులు వేసింది. గోరింటాకు, గుప్పెడంత మనసు వంటి టెలివిజన్ సీరియల్స్ చేసింది. అలాగే క్యాలీఫ్లవర్ అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. వాంటెడ్ పండుగాడు, అడ్డతీగల, తాజాగా భువన విజయం మూవీల్లో నటించింది. కానీ ఆమెకు మాత్రం బాగా పేరు వచ్చింది మాత్రం యాంకర్‌గానే. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి గేమ్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, గ్లామర్ పరంగా మంచి మార్కులు పడ్డాయి. ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వాసంతి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన ఫోటోషూట్లు, రీల్స్‌తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇప్పుడు తన ప్రియుడితో ఎంగేజ్ మెంట్ చేసుకుని, ఆ వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియోపై ఓ లుక్కేసి.. మీ అభిప్రాయమేమిటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by SUNKARA VEERA VENKATA SURYANARAYANA (@rjsurya_official)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbenjaminsbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş