iDreamPost
android-app
ios-app

రికార్డ్స్ మోత మోగిపోవాల్సిందే.. పుష్ప-2 టార్గెట్ ఫిక్స్..!

  • Published Oct 18, 2024 | 11:43 AM Updated Updated Oct 18, 2024 | 11:43 AM

Pushpa 2 Targets: దేవర జాతర అయిపొయింది. ఇక ఇప్పుడు పుష్ప-2 జాతర మొదలుకానుంది . ఈ క్రమంలో ఇప్పడు బన్నీ ముందు చాలా పెద్ద టార్గెట్ ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో అందరు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి పుష్ప ముందున్న బిగ్ టార్గెట్ ఎంతో చూసేద్దాం.

Pushpa 2 Targets: దేవర జాతర అయిపొయింది. ఇక ఇప్పుడు పుష్ప-2 జాతర మొదలుకానుంది . ఈ క్రమంలో ఇప్పడు బన్నీ ముందు చాలా పెద్ద టార్గెట్ ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో అందరు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి పుష్ప ముందున్న బిగ్ టార్గెట్ ఎంతో చూసేద్దాం.

  • Published Oct 18, 2024 | 11:43 AMUpdated Oct 18, 2024 | 11:43 AM
రికార్డ్స్ మోత మోగిపోవాల్సిందే.. పుష్ప-2 టార్గెట్  ఫిక్స్..!

దేవరోడు దుమ్ము దులిపేశాడు. బాక్స్ ఆఫీస్ లో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేశాడు. దాదాపు దేవర హడావిడి ముగిసినట్లే. ఇక ఇప్పుడు తగ్గేదేలే అంటూ సీన్ లోకి పుష్ప రాజ్ ఎంటర్ అవుతున్నాడు. మరో 50 రోజుల్లో పుష్ప-2 జాతర మొదలు కానుంది. ఈ ఏడాది రిలీజ్ కాబోయే ఆఖరి భారీ బడ్జెట్ సినిమా ఇది. సౌత్ లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2. ఇప్పటివరకు భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన.. భారీ బడ్జెట్ సినిమాలు పుష్ప రాజ్ కు బిగ్ టార్గెట్ ను సెట్ చేసి వెళ్లాయి. దీనితో ఇప్పుడు అందరి ఫోకస్ పుష్ప-2 కొట్టబోయే రికార్డ్స్ మీదే ఉంది. బన్నీ ఇప్పటివరకు క్రియేట్ అయినా ఓపెనింగ్ డే టార్గెట్ ను రీచ్ అవుతాడా.. కొత్త రికార్డ్స్ ను సృష్టిస్తాడా లేదా అనేది అందరికి పెద్ద ప్రశ్న.

అయితే ఇప్పటివరకు రిలీజ్ అయినా ప్రభాస్ కల్కి కానీ.. తారక్ దేవర కానీ రెండూ మొదటి పార్ట్స్ మాత్రమే. సో ఆ సినిమాలకు ఎలాంటి రికార్డ్స్ రావాలో అలాంటి రికార్డ్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు పుష్ప విషయానికొస్తే. ఆల్రెడీ ఈ సినిమా మొదటి పార్ట్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. సాధారణ అంచనాలతో వచ్చిన మూవీ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీనితో పార్ట్-2 ను అనౌన్స్ చేశారు. ఇక అప్పటినుంచి కూడా ఈ మూవీ పై అందరికి భారీ హైప్ నెలకొంది. ఆ తర్వాత రిలీజ్ అయినా పోస్టర్స్, టీజర్ ఆ అంచనాలను ఇంకాస్త పెంచాయి. సో హైప్ పరంగా మూవీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక పార్ట్-1 తో ఎండ్ చేసిన సస్పెన్స్ ను.. పార్ట్ 2 లో క్యారీ చేస్తారా లేదా అనేది తెలుసుకోవడమే బ్యాలన్స్. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కనుక.. పుష్ప రాజ్ ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ అయిన లెక్కలకు చెక్ పెట్టేస్తాడు.

మిక్స్డ్ టాక్ తో మొదలైన దేవర మొదటి రోజు 172 కోట్లు సాధించి ప్రభాస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. దానికంటే ముందు రిలీజ్ అయిన కల్కి మూవీ ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని అనుకున్నారు. కానీ కల్కి మొదటి రోజు 191 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది. బాహుబలి తర్వాత సాహో, ఆదిపురుష్ , రాధే శ్యామ్ లాంటి సినిమాలు రిలీజ్ అయినా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయాయి. ఆ తర్వాత సలార్ ఫస్ట్ డే 178 కోట్లు కలెక్ట్ చేయడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఆ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది కల్కి సినిమా. ఇక ఇప్పటివరకు మొదటి రెండు స్థానాల్లో మాత్రం జక్కన్న సినిమాలే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ 223 కోట్లు, బాహుబలి-2 215 కోట్లు కలెక్ట్ చేసాయి. సో ఇలా ఇప్పుడు బన్నీ ముందు ప్రస్తుతం చాలా టార్గెట్స్ ఉన్నాయి. మరి వీటిలో పుష్ప-2 మూవీ ఏ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి. పుష్ప పార్ట్1 హిందీ వెర్షన్ 10 కోట్లకు అమ్మితే మొత్తం మీద 100 కోట్లు రాబట్టింది. ఇక ఇప్పుడు పార్ట్2 కు హైప్ బాగా ఉంది కాబట్టి.. మొదటి రోజే 50 కోట్లు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. మొత్తం మీద ఈ మూవీ మొదటి రోజు 200 కోట్ల గ్రాస్ ను దాటేస్తుందని అంచనా. ఏమౌతుందో తెలియాలంటే డిసెంబర్ 6 వరకు ఆగాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetcasibomCasibom girişcasibomJojobet GirişcasibomcasibomcasibomjojobetcasibomMadridbetMadridbetcasibom girişbetgaranti girişganobetpokerklasjojobetMarsbahis GüncelCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom GirişGrandPashaBet ŞikayetJojobet Giriş