iDreamPost
android-app
ios-app

భోళా శంకర్ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

  • Author ajaykrishna Updated - 11:40 AM, Sat - 2 September 23
  • Author ajaykrishna Updated - 11:40 AM, Sat - 2 September 23
భోళా శంకర్ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫ్యాన్స్ లో హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. బాస్ సినిమాలకు ఉండే ఆ క్రేజ్ వేరు. సినిమా కొంచం బాగున్నా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసే కెపాసిటీ ఉన్న మెగాస్టార్ నుండి రీసెంట్ గా భోళా శంకర్ రిలీజ్ అయ్యింది. తమిళ వేదాలం సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించాడు. షాడో తర్వాత మెహర్ రమేష్.. దాదాపు 8 ఏళ్ల తర్వాత తీసిన సినిమా ఇదే. అందులోనూ మెగాస్టార్ తో సినిమా అనేసరికి ఈ కాంబినేషన్ అందరి దృష్టిలో పడింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ అదనపు ఆకర్షణగా నిలిచింది.

మొత్తానికి సాంగ్స్, ట్రైలర్ అంతంత మాత్రంగా బజ్ క్రియేట్ చేసినప్పటికీ.. మెగాస్టార్ మీద అభిమానంతో ఫ్యాన్స్ అందరు సినిమాని భుజాలపై మోసే ప్రయత్నం చేశారు. కానీ.. థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో నుండే సినిమాకు నెగిటివ్ టాక్ మొదలైంది. వెరసి.. భోళా శంకర్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా క్రెడిట్ అందుకుంది. మెగాస్టార్ సరసన తమన్నా.. సైరా తర్వాత సెకండ్ టైమ్ ఈ సినిమాలో నటించింది. అభిమానులు కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ.. సినిమా అటు ప్రేక్షకులను, ఇటు అభిమానులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో కలెక్షన్స్ కూడా రెండో రోజు నుండే తగ్గిపోయాయి.

ఇక చిరంజీవి ఫ్యాన్స్ అయితే బాస్ ఆ సినిమా చేయకుండా ఉండాల్సిందని అనుకుంటున్నారు. అప్పటికే సినిమా వచ్చేసింది. అయితే.. భోళా శంకర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. థియేటర్స్ లో ఫెయిల్ అయినా.. ఓటిటిలో చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు ప్రేక్షకులు. దీంతో ఎప్పుడెప్పుడు ఓటిటి రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కాగా.. భోళా శంకర్ ఇప్పుడు విజయక చవితి సందర్బంగా డిజిటల్ స్ట్రీమింగ్ కానుందట. ఈ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ 17 నుండి స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని సమాచారం. మరి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. భోళా శంకర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet