iDreamPost
android-app
ios-app

ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారి.. GPSతో ‘భోళా శంకర్’!

  • Author Soma Sekhar Published - 06:51 PM, Thu - 10 August 23
  • Author Soma Sekhar Published - 06:51 PM, Thu - 10 August 23
ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారి.. GPSతో ‘భోళా శంకర్’!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన చిత్రం ‘భోళా శంకర్’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఇక రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి మెగా అభిమానుల్లో, సగటు సినీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో అద్భుత ఘట్టానికి తెరలేపనుంది భోళా శంకర్ టీమ్. జీపీఎస్ ట్రాకింగ్ తో చూస్తే మెగాస్టార్ ముఖ చిత్రం కనిపించేలా హైదరాబాద్ వీధుల్లో 600 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించనుంది. దీంతో ప్రపంచ సినీ చరిత్రలో GPSతో ఇలాంటి భారీ ర్యాలీ చేపట్టడం ఇదే తొలిసారిగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

మరికొన్ని గంటల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ వీధుల్లో నేడు (ఆగస్టు 10న) 600 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీని నిర్వహిస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ తెలిపింది. జీపీఎస్ ట్రాకింగ్ మెుత్తంగా చూస్తే.. మెగాస్టార్ ముఖ చిత్రం కనిపించేలా ఈ ర్యాలీని చేపట్టడం విశేషం. కాగా.. ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో ఏ హీరోకు ఇలాంటి ర్యాలీ చేయలేదని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది.

ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఈ ర్యాలీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మెగాస్టార్ తో నటించిన నటీ, నటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. వీడియోలు పంపాలని భోళా శంకర్ మేకర్స్ కోరారు. ఇక ఇటీవలే మెగాస్టార్ కు 126 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు అభిమానులు. మరి మెగాస్టార్ పై ఉన్న అభిమానంతో ఈ రేంజ్ లో ర్యాలీని చేపట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: తల్లితో కలసి ఉన్న ఈ స్టార్ డైరెక్టర్​ను గుర్తుపట్టారా?