iDreamPost
android-app
ios-app

తల్లితో కలసి ఉన్న ఈ స్టార్ డైరెక్టర్​ను గుర్తుపట్టారా?

  • Author singhj Updated - 05:24 PM, Thu - 10 August 23
  • Author singhj Updated - 05:24 PM, Thu - 10 August 23
తల్లితో కలసి ఉన్న ఈ స్టార్ డైరెక్టర్​ను గుర్తుపట్టారా?

ఒక సినిమా తెరకెక్కాలంటే ఎంత మంది ఉన్నా దర్శకుడు లేకుంటే ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చదు. అందుకే డైరెక్టర్​ను ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అని పిలుస్తారు. సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే దర్శకుడు తన విజన్​లో దాన్ని చూసేయాలి. అప్పుడే నిర్మాణం సమయంలో ఎక్కడ చిన్న తేడా వచ్చినా ముందే కనిపెట్టొచ్చు. స్టోరీ, స్క్రీన్​ ప్లే, మేకింగ్ పై పట్టు ఉంటే మంచి దర్శకుడిగా రాణించొచ్చు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎందరో అద్భుతమైన దర్శకులు ఉన్నారు. అయితే ప్రతి దశాబ్దానికోసారి కొత్త డైరెక్టర్స్ వస్తుంటారు. వాళ్లు ఇండస్ట్రీ నడకనే మార్చేస్తారు.

అలాంటి అరుదైన డైరెక్టర్​ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన దర్శకుడాయన. ఒకే ఒక్క చిత్రంతో టాలీవుడ్​లో సినిమాలు తీసే విధానాన్ని పూర్తిగా మార్చేశారు. మూవీస్​లో బ్యాగ్రౌండ్​ మ్యూజిక్​ ఎంత ముఖ్యమో ఆయన నిరూపించారు. ఆయన ప్రతిభ తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదు. ఇండియన్ మూవీస్​లో టాప్ ఇండస్ట్రీగా చెప్పుకునే బాలీవుడ్​కు వెళ్లారాయన. అక్కడ కూడా ఒకే ఒక్క సినిమాతో పరిశ్రమను షేక్ చేశారు. ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఎందరో స్టార్లు పోటీపడ్డారు.

టాలీవుడ్​, బాలీవుడ్​ను అంతగా ఊపేసిన ఆ దర్శకుడు మరెవరో కాదు.. రామ్ గోపాల్ వర్మ. ‘శివ’ సినిమాతో తెలుగునాట సంచలనం సృష్టించారాయన. ‘సత్య’తో బాలీవుడ్​లో ఫిల్మ్ మేకింగ్​ స్టయిల్​నే మార్చేశారు. ఆయన్ను ఫ్యాన్స్ ముద్దుగా ఆర్జీవీ అని పిలుస్తుంటారు. ఆయన తీసే సినిమాలే కాదు.. ఇచ్చే స్పీచ్​లు, ఇంటర్వ్యూలు, రాసిన పుస్తకాలు కూడా చాలా ఫేమస్. ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఆర్జీవీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ‘వ్యూహం’ అనే చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఆర్జీవీకి సంబంధించిన ఒక ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. చిన్నప్పుడు తన తల్లి సూర్యమ్మతో కలసి ఆయన దిగిన ఫొటో ఇది. మరి.. ఆర్జీవీ సినిమాల్లో మీకు ఏది ఎక్కువ ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

did you remember that star director 2

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş