iDreamPost
android-app
ios-app

Bheemla Nayak OTT : ఓటిటి సినిమా కోసం ఈ రేంజ్ హడావిడా

  • Published Mar 26, 2022 | 8:08 PM Updated Updated Mar 26, 2022 | 8:08 PM
  • Published Mar 26, 2022 | 8:08 PMUpdated Mar 26, 2022 | 8:08 PM
Bheemla Nayak OTT : ఓటిటి సినిమా కోసం ఈ రేంజ్ హడావిడా

ఇటీవలే ఓటిటిలో విడుదలైన భీమ్లా నాయక్ పలు సంచలనాలకు వేదికగా మారుతోంది. ఆహా,డిస్నీ హాట్ స్టార్ రెండూ హక్కులు పొందటంతో దాన్ని ప్రమోట్ చేసే విషయంలో ఎవరికి వారు కొత్త దారులు వెతుకుతున్నారు. అత్యంత వేగంగా వంద మిలియన్ నిమిషాల వ్యూస్ కు చేరుకున్న సినిమాగా ఇది రికార్డు సృష్టించిందని ఆల్రెడీ ఆహా పబ్లిసిటీ షురూ అయ్యింది. మరోవైపు హాట్ స్టార్ నేనేం తక్కువ తినలేదంటూ ఏకంగా హైదరాబాద్ నెక్ లెస్ రోడ్ లో చిన్న స్టేజి వేయించి దాని మీద ఈ సినిమా కటవుట్లతో పాటు టైటిల్ లోగో ఇతరత్రా గ్రాండ్ గా ప్రదర్శనకు పెట్టింది. అక్కడో చిన్న ఈవెంట్ చేసే ప్లానింగ్ లో సదరు సంస్థ ఉన్నట్టు లేటెస్ట్ అప్ డేట్.

కొద్దిరోజుల క్రితం ఆహాలో స్ట్రీమింగ్ కు ముందు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ని పిలిపించి కొత్త ట్రైలర్ ని లాంచ్ చేయించారు.హాట్ స్టార్ తన యాప్ ని అప్ గ్రేడ్ చేసుకున్న వాళ్లకు స్పెషల్ సర్ప్రైజ్ అంటూ పబ్లిసిటీ చేసింది. ఇలాంటి ట్రెండ్ గతంలో ఎప్పుడూ చూడనిది. మా ప్లాట్ ఫార్మ్ లోనే చూడమని పదే పదే కోరుతూ ఒకే సినిమా గురించి రెండు డిజిటల్ కంపనీలు పోటీ పడటం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. ఇదిక్కడితో ఆగేలా లేదు. కనీసం మరో వారం పది రోజులు ఈ ప్రోగ్రాంని కంటిన్యూ చేసేలా ఉన్నారు. ఇప్పటికే చాలా వెబ్ సైట్స్ కు యాడ్స్ ఇచ్చారు. దీనికోసం బడ్జెట్ ని భారీగా కేటాయించుకుని మంచి నీళ్లలా ఖర్చు పెడుతున్నారు.

థియేటర్ల నుంచి వెళ్ళిపోయినా కూడా భీమ్లా ఈ రకంగా సంచలనాలకు వేదికగా మారుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలకు ఇదే తరహా ప్రచారాన్ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. కరోనా వచ్చి వెళ్ళిపోయాక ప్రేక్షకుల అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. అందులో ఓటిటి వినోదం ఒకటి. టికెట్ రేట్లు భరించలేక డిజిటల్ లో వచ్చాకే కొత్త సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉన్నారు. అందుకే వాళ్ళను వీలైనంత ఎక్కువగా ఆకట్టుకోవడానికి ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు. అఖండతో సూపర్ బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్న హాట్ స్టార్ భీమ్లా నాయక్ ను వీలైనంత క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆహా కూడా తక్కువ తినలేదు లెండి

Also Read : Bollywood : అందుకే మన సినిమాలకు ఎగబడుతున్నారు

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss