iDreamPost
iDreamPost
విశ్వాసం తర్వాత కొంత గ్యాప్ తో అజిత్ చేసిన వలిమై ఎల్లుండి అంటే 24న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తన మార్కెట్ ఇక్కడ భారీగా లేకపోయినా ఉన్నంతలో డీసెంట్ ఓపెనింగ్స్ ని అభిమానులు ఆశిస్తున్నారు. కాకపోతే మొదటి రోజు ఎలాంటి పోటీ లేకపోయినా అడ్వాన్ బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉండటం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. హైదరాబాద్ లో ఇప్పటికీ ఏ షో కంప్లీట్ గా ఫుల్ కాలేదు. ఆటలు మొదలయ్యే టైంకి నిండొచ్చు కానీ ట్రెండ్ మాత్రం ఆశించినంత లేదు. రెండున్నర కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న వలిమై టైటిల్ యధాతథంగా తమిళ్ దే పెట్టడం మాస్ పరంగా మైనస్ అయ్యిందనే చెప్పాలి
ఇక ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ నటించిన గంగూబాయ్ కటియావాడి ఒక రోజు ఆలస్యం 25న వస్తోంది. అజయ్ దేవగన్ ఓ కీలక పాత్ర పోషించారు. మన ఆడియన్స్ కోసం తెలుగులో కూడా డబ్బింగ్ చేసి వదులుతున్నారు. సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ బయోపిక్ ట్రైలర్ ఆకట్టుకునేలా వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో దీనికి సైతం బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేవు. ఇక్కడ అజిత్ కి అలియాకు వచ్చిన ప్రధాన చిక్కు భీమ్లా నాయక్. దాదాపు అన్ని కేంద్రాల్లో ఈ సినిమానే సింహభాగం ఆక్రమించుకోబోతోంది. ఇప్పటికే హడావిడి ఓ రేంజ్ లో ఉంది. ట్రైలర్ టాక్ తో సంబంధం లేకుండా హైప్ పెరుగుతోంది.
పవర్ స్టార్ మూవీ కావడంతో సహజంగానే జనాల దృష్టి దీని మీదే ఉంటుంది. ఇది రీమేక్. కానీ ఒరిజినల్ కంటెంట్ తో వస్తున్న వలిమై, గంగూబాయి కటియావాడిల మీద భీమ్లా ప్రభావం నేరుగా పడుతోంది. దీంతో ఎక్స్ పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ షేర్లు అజిత్ అలియా సినిమాలకు వస్తాయని ట్రేడ్ అంచనా. ఇక్కడ ఈ మూడు చిత్రాల టాక్ చాలా కీలకం. ఎంత పవన్ బ్రాండ్ ఉన్నా వీకెండ్ తర్వాత డ్రాప్ ని మేనేజ్ చేయడం ముఖ్యం. ఒకవేళ వలిమై, గంగూబాయ్ లు కనక స్లోగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఎఫెక్ట్ మొదలవుతుంది. కాకపోతే అజిత్ తెలివిగా ఒక రోజు ముందే రావడం తనకు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి
Also Read : Nandamuri Balakrishna : ట్రెండ్ సెట్టింగ్ టైటిల్ తో బాలకృష్ణ ?