Bharateeyudu 2: ‘భారతీయుడు-2’ ఎఫెక్ట్.. ‘గేమ్ ఛేంజర్’పై ఫ్యాన్స్​లో టెన్షన్!

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి హైప్ మధ్య ఇవాళ రిలీజైంది ‘భారతీయుడు 2’ మూవీ. ఏస్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించడం, యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ నటించడం, బ్లాక్​బస్టర్ ఫిల్మ్ ‘భారతీయుడు’కు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి హైప్ మధ్య ఇవాళ రిలీజైంది ‘భారతీయుడు 2’ మూవీ. ఏస్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించడం, యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ నటించడం, బ్లాక్​బస్టర్ ఫిల్మ్ ‘భారతీయుడు’కు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి హైప్ మధ్య ఇవాళ రిలీజైంది ‘భారతీయుడు 2’ మూవీ. ఏస్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించడం, యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ నటించడం, కల్ట్ క్లాసిక్ ‘భారతీయుడు’కు సీక్వెల్ కావడం, భారీ బడ్జెట్​తో రూపొందించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ ఫిల్మ్​కు మార్నింగ్ షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చేసింది. కథ, కథనం దగ్గర నుంచి ఏదీ బాగోలేదని, సినిమా మొత్తం చప్పగా సాగిందని, కమల్ హాసన్ మేకప్ కూడా సెట్ కాలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శంకర్ మ్యాజిక్ చేస్తాడనుకుంటే ఇలా తీశాడేంటని అంటున్నారు. ఎలాంటి హై ఇవ్వకుండా సాగిన ఈ సినిమాను చూస్తుంటే తీసింది శంకరేనా అనే అనుమానం వస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.

‘భారతీయుడు 2’పై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ రావడం, అటు రివ్యూలు కూడా అలాగే రావడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. మూవీలో యాక్ట్ చేసిన కమల్ హాసన్ ఫ్యాన్స్ కంటే చెర్రీ అభిమానులే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం శంకర్​తో చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఫిల్మ్ చేస్తుండటమే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్​ను జరుపుకున్న ఈ మూవీలో చరణ్ క్యారెక్టర్ పోర్షన్​ వరకు కంప్లీట్ అయిపోయిందని.. కొంత చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉన్నాయని అంటున్నారు. ఈ తరుణంలో శంకర్ తీసిన ‘భారతీయుడు 2’కు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ రావడంతో చరణ్ ఫ్యాన్స్ గాభరా పడుతున్నారు.

‘భారతీయుడు 2’లాగే ‘గేమ్ ఛేంజర్​’ను కూడా తీసి ఉంటే తమ పరిస్థితి ఏంటని చరణ్ అభిమానులు ఆందోళనగా ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియా రేంజ్​లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న చెర్రీని ‘గేమ్ ఛేంజర్’ ఇంకో మెట్టు ఎక్కిస్తుందని అనుకుంటే.. ఇప్పుడు ఆ భరోసా కనిపించడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ స్టోరీ, గ్రిప్పింగ్ స్క్రీన్​ప్లేతో మంచి పాయింట్ తీసుకొని సినిమాను తీస్తే ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారని.. అలా కాదని ‘భారతీయుడు 2’లా ఏమాత్రం ఎంగేజింగ్​గా లేకుండా, ఎలాంటి హై ఇవ్వకుండా, చప్పగా తెరకెక్కిస్తే మాత్రం ‘గేమ్ ఛేంజర్​’ కూడా ఇలాంటి రిజల్ట్ చూడక తప్పదని వాళ్లు భయపడుతున్నారు. మరోవైపు ‘భారతీయుడు 2’ ఎఫెక్ట్​తో చరణ్ చిత్రంలో మార్పులు తప్పవని, హిట్ కోసం శంకర్ ఛేంజెస్‌ చేస్తాడని టాక్ నడుస్తోంది. మరి.. ‘భారతీయుడు 2’ ప్రభావం ‘గేమ్ ఛేంజర్’పై ఎంతమేర ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments