Krishna Kowshik
రెండు జడలు వేసుకుని తదేకంగా చూస్తున్న ఈ చిన్నారి. . ఇప్పుడో స్టార్ యాంకర్. మాటలు తూటాల్లా రావాల్సిందే. ఆమె వృత్తి మరీ. అలాగే సామాజిక అంశాలపై కూడా చర్చిస్తుంది. ఇక ఇంటర్వ్యూల్లో కూడా తనదైన ప్రశ్నలతో..
రెండు జడలు వేసుకుని తదేకంగా చూస్తున్న ఈ చిన్నారి. . ఇప్పుడో స్టార్ యాంకర్. మాటలు తూటాల్లా రావాల్సిందే. ఆమె వృత్తి మరీ. అలాగే సామాజిక అంశాలపై కూడా చర్చిస్తుంది. ఇక ఇంటర్వ్యూల్లో కూడా తనదైన ప్రశ్నలతో..
Krishna Kowshik
వెండితెర తర్వాత అంతే ఆకట్టుకునేది, ఆకర్షించేది బుల్లితెర. నిజం చెప్పాలంటే.. బిగ్ స్క్రీన్ కన్నా స్మాల్ స్క్రీనే ఎక్కువ ఎంటర్ టైన్ చేస్తోంది. మహిళలు ఎక్కువగా మెచ్చేది స్మాల్ స్క్రీనే. సినిమాలు, సీరియల్స్, స్పెషల్ షోస్ ఉండనే ఉన్నాయి. పొద్దున్న నుండి సాయంత్రం వరకు టీవీకి అతుక్కుపోయేవాళ్లు కూడా ఉన్నారు. పిల్లలు కార్టూన్ నెట్ వర్క్ ఛానల్స్ ఎక్కువగా చూస్తుంటారు. ఇక పెద్దలు, అందులోనూ మగవాళ్లు ఉంటే..తప్పని సరిగా చూసేది వార్తా ఛానల్సే. ఎప్పటికీకప్పుడు రాజకీయ వార్తలు కానీ, లేదా సినిమా న్యూసులు తెలుసుకోవాలంటే టీవీ చూడాల్సిందే. అయితే ఇప్పటికే చాలా న్యూస్ ఛానల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో తడుముకోకుండా.. మాటలకు బ్రేకులు పడకుండా హాట్ హాట్ వార్తలు అందిస్తున్నారు న్యూస్ యాంకర్స్ లేదా ప్రజెంటర్స్.
ఇదిగో ఈ ఫోటోలో ఉన్న చిన్నారి కూడా ఇప్పుడు తెలుగు బుల్లితెరపై దూసుకెళుతున్న యాంకరమ్మ. వార్తలు చదవడంలో, ఇంటర్వ్యూలో ప్రశ్నలు సంధించడంలో ఆమెకు ఆమె దిట్ట. విషాద వార్త అయినా, ఆనంద వార్త అయినా, సాధారణ వార్త అయినా..తన గొంతులోనే హవ భావాలు పలికిస్తుంది. వార్త ఏదైనా గుండెల్లోకి దూసుకెళ్లేలా చెబుతుంది. ఎంతో మంది న్యూస్ యాంకర్లకు ఈమె ఒక ఇన్పిరేషన్. ఆమె మరెవరో కాదు టీవీ 9 యాంకర్ దేవీ నాగవల్లి. వార్తలు ప్రజెంట్ చేయడంలో ఆమెకు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. కేవలం యాంకర్ మాత్రమే.. సామాజిక అంశాలపైనా స్పందిస్తూ ఉంటుంది. పొలిటికల్, మూవీ ఇంటర్వ్యూల్లో ప్రశ్నాస్త్రాలు సంధించడంలో ఆమెను మించిన వారు లేరనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో పుట్టిన దేవీ నాగవల్లి.. విద్యాభ్యాసం అంతా ఏపీలోనే పూర్తి చేసింది. తొలుత ఆమె ట్యూటర్ గా పని చేసింది. ఆ తర్వాత ఇది మనకు సెట్ కాదని గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సుతో పాటు మాస్ కమ్యూనిషన్ అండ్ జర్నలిజంలో డిప్లమా చేసింది. ఆ తర్వాత ఓ టీవీ ఛానల్ యాంకర్‌గా సెలక్ట్ అయ్యి… ఆ తర్వాత టీవీ 9లో జర్నలిస్టుగా, యాంకర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. గ్రౌండ్ రిపోర్టర్ నుండి న్యూస్ ప్రజెంటర్‌గా ఎన్నో న్యూస్ కవరేజ్ చేసింది. పుల్వామ దాడి ఇండోనేషియా సునామీ, భూకంపం, శ్రీలకంలో బ్లాస్ట్ ఇలాంటి ఎన్నో వార్తలను అందించింది. షారూఖాన్ నుండి బిగ్ సెలబ్రిటీలను ఏ మాత్రం బెరుకు లేకుండా ఇంటర్వ్యూ చేసింది.
అదే తనకు నచ్చకపోతే అలాగే ఇచ్చి పడేస్తుంది. అది లైవ్ షో అయినా, రికార్డు షో అయినా. బిగ్ బాస్ 4లో ఎంట్రీ ఇచ్చిన దేవీ.. ఎంత కాలం కొనసాగలేదు. ఇక సామాజిక అంశాలపైనా స్పందిస్తుంది. రూ. 10 కాయిన్ నోట్ చెల్లుతుందని విజయ్ దేవరకొండతో చెప్పించిన నాటి నుండి.. రోడ్డుపై గుంత పడిన విషయంపై ఇలా సామాజిక కోణంలో స్పందిస్తూ ఉంటుంది. ఈ రోజు దేవీ నాగవల్లి పుట్టిన రోజు. యాంకరమ్మగా ఆగిపోలేదు.. మరో కొత్త ప్రయాణంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె వెండితెరపైకి వచ్చేందుకు ప్రిపేర్ అవుతుంది. పుష్ప 2లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తోంది.