P Krishna
Bharateeyudu 2: సినీ ఇండస్ట్రీలో 1996 లో వచ్చిన భారతీయుడు సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయంలో ఈ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. తాజాగా ఈ మూవీ సీక్వెల్ గా భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Bharateeyudu 2: సినీ ఇండస్ట్రీలో 1996 లో వచ్చిన భారతీయుడు సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయంలో ఈ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. తాజాగా ఈ మూవీ సీక్వెల్ గా భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
P Krishna
ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతుంటాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి శంకర్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’. ఈ మూవీ 1996లో రిలీజ్ అయ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ గా ‘భారతీయుడు 2’ జులై 12 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రోమోషన్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఓ వినూత్నమైన వీడియో చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ భారతీయుడు 2 టీమ్ ఏం వీడియో చేశారు? పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ నివారణలో ప్రజలకు ఉపయోగపడే సామాజిక బాధ్యతలు ఉండాలి.సినిమా వాళ్లకు టికెట్ రేట్లు పెంచాలన్నా.. సినిమాలకు ఏదైనా సాయం కావాలన్నా ఆ సినీ యూనిట్ డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ వీడియోలు తీయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సెలబ్రెటీల నుంచి రక రకాల స్పందనలు వచ్చాయి.తాజాగా మూవీ ప్రమోషన్ లో భాగంగా సిద్దార్థ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో సీఎంకి క్షమాపణుల చెప్పారు.తాను చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ చిత్ర బృందం డ్రగ్స్ నివారణపై ఓ వీడియో రిలీజ్ చేశారు.
భారతీయుడు 2 మూవీ టీమ్ లోని నటీనటులు కమల్ హాసన్, సిద్దార్థ్, డైరెక్టర్ శంకర్, సముద్ర ఖని డ్రగ్స్ వాడొద్దు, డ్రగ్స్ వల్ల ప్రాణ హాని ఉంది అంటూ చెబుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి అందరూ చేయూతనివ్వాలి. డ్రగ్స్ నివారణపై ఆయన చేస్తున్న మంచి పనికి చాలా గొప్పగా ఉందని చెబుతూ ఓ చిన్న వీడియో రిలీజ్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి చెప్పింది మొదట భారతీయుడు 2 చిత్ర యూనిట్ తోనే మొదలైంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే భారతీయుడు 2 మూవీలో కూడా డ్రగ్స్ పై పోరాటం ఉంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు.
Team #Indian2 extends its full support to the Telangana Government’s initiative against drugs and requests everyone to say “NO TO DRUGS.”@revanth_anumula @ikamalhaasan @shankarshanmugh #Siddharth @thondankani#ZeroTolerance #Bharateeyudu2 #Indian2FromJuly12 pic.twitter.com/enPA6QmySr
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) July 9, 2024