Nidhan
Bharateeyudu 2: ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు 2’ చిత్రం ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫిల్మ్ ఏకకాలంలో తెలుగు, తమిళంలో విడుదలైంది.
Bharateeyudu 2: ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు 2’ చిత్రం ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫిల్మ్ ఏకకాలంలో తెలుగు, తమిళంలో విడుదలైంది.
Nidhan
ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు 2’ చిత్రం ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫిల్మ్ ఏకకాలంలో తెలుగు, తమిళంలో విడుదలైంది. ‘భారతీయుడు’ ఫస్ట్ పార్ట్ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోనూ వసూళ్ల వర్షం కురిపించింది. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ మూవీకి డైరెక్టర్ శంకర్ సీక్వెల్ తీస్తున్నారనే వార్తే చర్చనీయాంశంగా మారింది. యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్‌ను మళ్లీ ‘భారతీయుడు’గా చూసేందుకు అందరూ ఎంతగానో వెయిట్ చేశారు. అయితే లేటెస్ట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భారతీయుడు 2’కు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది.
కథ, కథనం సరిగ్గా లేకపోవడం, బోరింగ్‌గా ఉండటం, కమల్ హాసన్ పాత్ర మేకప్ కూడా బాగోకపోవడంతో ‘భారతీయుడు 2’కు నెగెటివ్ టాక్ వచ్చేసింది. అసలు ఇది శంకర్ తీసిన సినిమానేనా అని చాలా మంది నెటిజన్స్ సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శంకర్ టేకింగ్, ఆయన కథను చెప్పే విధానం ఇలా ఉండవని, ఆయన మ్యాజిక్ కంప్లీట్‌గా మిస్ అయిందని వాపోతున్నారు. ఏదో ఔట్ డేటెడ్ ఫిల్మ్ చూస్తున్నట్లుగా అనిపించిందని.. ఫస్ట్ 20 నిమిషాలు తప్పితే మూవీ అంతా బోరింగ్‌గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో ‘భారతీయుడు 2’ మూవీపై ఓ యంగ్ డైరెక్టర్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ ఫేమ్ డైరెక్టర్ వంశీధర్ గౌడ్ తాజాగా ‘భారతీయుడు 2’ను వీక్షించారు. అయితే సినిమా బోరింగ్‌గా ఉండటం, ఆడియెన్స్ సహనానికి పరీక్షగా ఉండటంతో ఈ విషయాన్ని ఫన్నీగా ట్రోల్ చేశారు వంశీధర్. సినిమాలో ఉండే మర్మకళ సీన్స్‌ను కాపీ చేశారు. తన రెండు వేళ్లు మడతబెట్టి గొంతులో పొడుచుకొని చనిపోయినట్లు యాక్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. వంశీధర్ వీడియోను బట్టి ఫిల్మ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. మూవీకి భారీ నష్టాలు తప్పవని చెబుతున్నారు. అయితే భారీ బడ్జెట్‌తో తీసిన ‘భారతీయుడు 2’ గట్టెక్కాలంటే బాక్సాఫీస్ వద్ద స్టడీగా రన్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. మరి.. ‘భారతీయుడు 2’ను మీరు చూసినట్లయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
#Bharateeyudu2 ❤️pic.twitter.com/ovbmbzvMfP
— Milagro Movies (@MilagroMovies) July 13, 2024