iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD: కల్కి మూవీ.. మహిళలకు బంపర్ ఆఫర్! కానీ..

  • Published Jul 13, 2024 | 5:48 PM Updated Updated Jul 13, 2024 | 5:48 PM

ఓ ఐ మ్యాక్స్ యాజమాన్యం కల్కి మూవీ చూడటానికి మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదీకాక డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి మూవీ చూడొచ్చు. మరి ఆ ఆఫర్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

ఓ ఐ మ్యాక్స్ యాజమాన్యం కల్కి మూవీ చూడటానికి మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదీకాక డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి మూవీ చూడొచ్చు. మరి ఆ ఆఫర్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

Kalki 2898 AD: కల్కి మూవీ.. మహిళలకు బంపర్ ఆఫర్! కానీ..

‘కల్కి’.. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం విడుదలై రెండు వారాలు కావొస్తున్నప్పటికీ.. కలెక్షన్ల జోరు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ, పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా నార్త్ అమెరికాలో 12 మిలియన్ల మార్క్ ను అందుకున్న చిత్రంగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక భారతీయుడు 2కి మిక్స్ డ్ టాక్ రావడంతో.. కల్కికి మరికొన్ని రోజులు ఎదురులేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఓ ఐ మ్యాక్స్ యాజమాన్యం మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదీకాక డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి మూవీ చూడొచ్చు. మరి ఆ ఆఫర్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా ఊహించని కలెక్షన్లతో దూసుకెళ్తోంది. రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. రిలీజ్ అయ్యి రెండు వారాలు కావొస్తున్నప్పటికీ.. ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డ్ లతో కళకళలాడుతున్నాయి థియేటర్లు. ఈ నేపథ్యంలో ఓ ఐ మ్యాక్స్ యాజమాన్యం మహిళలకు బంపరాఫర్ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అంటూ ఆఫర్ ఇచ్చింది. ఫ్యామిలీ అండ్ మహిళలకే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

అయితే ఇది ఇండియాలో కాదు.. అమెరికాలో. అమెరికాలోని లాస్‌ ఎంజెల్స్‌ బిగ్గెస్ట్‌ ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ టీసీఎల్‌ చైనీస్‌ థియేటర్లో మాత్రమే ఈ ఆఫర్ ఉంది. ఇది ప్రపంచంలోనే పెద్ద థియేటర్ కావడం విశేషం. డైెరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి ఈ మూవీని చూడొచ్చు. ఈ ఆఫర్ కొరకు ఓ ఇన్ స్టా పేజ్ ను ఫాలో అయ్యి.. మీ పూర్తి పేరు, ఫోన్ నంబర్ ఇవ్వాలి. సెకండ్ స్టెప్ లో థియేటర్ యాజమాన్యం దానిని కన్పామ్ చేసి టికెట్ ఇస్తుంది. ఇక ఈ ఆఫర్ ను చూసిన ప్రేక్షకులు ఇండియాలో కూడా ఇలా పెడితే బాగుండేది అంటూ సోషల్ మీడియా వేదికగా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

jojobetjojobet girişJojobet Casino Sitesicasibomjojobetmarsbahismarsbahis güncel girişjojobet giriş adresi