iDreamPost
android-app
ios-app

భగవంత్ కేసరి ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

  • Published Nov 01, 2023 | 1:45 PM Updated Updated Nov 02, 2023 | 11:35 PM

భగవంత్ కేసరీ.. దసరా పండుగను పురస్కరించుకుని విడుదలైన అతిపెద్ద సినిమాల్లో ఒకటి. గత నెల 19న విడుదలైన ఈ సినిమా త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రులుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రాబోతుంది అంటే..?

భగవంత్ కేసరీ.. దసరా పండుగను పురస్కరించుకుని విడుదలైన అతిపెద్ద సినిమాల్లో ఒకటి. గత నెల 19న విడుదలైన ఈ సినిమా త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రులుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రాబోతుంది అంటే..?

  • Published Nov 01, 2023 | 1:45 PMUpdated Nov 02, 2023 | 11:35 PM
భగవంత్ కేసరి ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

దసరా బరిలోకి దిగిన బాలకృష్ణ మూవీ భగవంత్ కేసరి విజయాన్ని సొంతం చేసుకుంది. అపజయాలు ఎరుగని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, మూవీల పరంగా సంచలనాలకు కేంద్ర బిందువైన శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. యాక్షన్, ఫ్యామిలీ డ్రామాతో కట్టిపడేసిన ఈ సినిమాపై కలెక్షన్లు వర్షం కురిపించింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సినీ పండితుల విశ్లేషణ. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాం పాల్ విలన్‌గా మెప్పించారు. శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

ఈ సినిమాలో బాలయ్య బాబు వయస్సుకు తగ్గ పాత్ర పోషించారని అనుకుంటున్నారంతా. శ్రీలీల కూడా తనదైన మార్కు నటనతో దూసుకెళ్లింది. ఇందులో బాలకృష్ణ, శ్రీలీల తండ్రి, కూతురుగా నటించిన సంగతి విదితమే.  గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సీన్స్ అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయ్యి.. సినిమాపై ఓపెనియన్‌ను మార్చేశాయని చెప్పవచ్చు. బాలయ్య అంటే ఫుల్ మాస్ మూవీ అనుకుంటే.. ఈ సీన్‌తో ఎమోషన్ టచ్ ఇచ్చారు అనిల్ రావిపూడి. అంతేకాకుండా ఆడపిల్లను సింహలా పెంచాలనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందించారు. అయితే థియేటర్లలో సినిమా సందడి చేస్తుండగానే.. ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఫ్యామిలీ ఆడియన్స్‌ను కనెక్ట్ చేసిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసింది అమెజాన్ ప్రైమ్. భారీ ధరకు ఈ సినిమాను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 23న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే మేకర్స్ నుండి అఫిషియల్ ఎనౌన్స్ రాబోతుందని సమాచారం.  ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. గత నెల 19న విడుదలైన ఈ సినిమా నెల రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş