Bengaluru Crime News: ఆ ప్రశ్న అడిగినందుకు కానిస్టేబుల్‌ను చంపిన ప్రియురాలు!

ఆ ప్రశ్న అడిగినందుకు కానిస్టేబుల్‌ను చంపిన ప్రియురాలు!

ఇద్దరూ ఒకే పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్నారు. చాలా ఏళ్ల పరిచయం కూడా ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే, అనుమానం వీరి ప్రేమలో చిచ్చు రేపింది.

ఇద్దరూ ఒకే పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్నారు. చాలా ఏళ్ల పరిచయం కూడా ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే, అనుమానం వీరి ప్రేమలో చిచ్చు రేపింది.

అతడో కానిస్టేబుల్‌.. ఆమె ఓ హోం గార్డు.. అతడికి పెళ్లయి పిల్లలు ఉన్నారు. అయినప్పటికి ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నేళ్ల పాటు సజావుగా సాగిన వీరి సంబంధం తర్వాత ఇబ్బందిలో పడింది. అనుమానం పెను భూతమైంది. గంటల్లో అంతా ముగిసిపోయింది. ప్రియురాలి చేతిలో ప్రియుడు హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సంజయ్‌ బసవన గుడిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రాణి అనే హోంగార్డు కూడా అక్కడే పనిచేస్తోంది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. సంజయ్‌కి పిల్లలు ఉన్నా సరే.. రాణితో సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ గత కొన్నేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. దాదాపు నెల రోజులు ఇద్దరూ దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత శృంగారం పాల్గొన్నారు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో చేతన్‌ అనే వ్యక్తి రాణికి ఫోన్‌ చేశాడు.

దీంతో సంజయ్‌కి అనుమానం వచ్చింది. ‘ఫోన్‌ చేసింది ఎవరు?’ అని ప్రశ్నించాడు. తర్వాత ఆమె ఫోన్‌ను తీసుకున్నాడు. వాట్సాప్‌ ఓపెన్‌ చేశాడు. చేతన్‌తో రాణి చాటింగ్‌ చేసినట్లు తేలింది. ఇదే విషయంపై సంజయ్‌కి, రాణికి మధ్య గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే సంజయ్‌ బయటకు వెళ్లి పెట్రోల్‌ తెచ్చాడు. నన్ను పెట్రోల్‌ పోసి తగలబెట్టు అని అన్నాడు. దీంతో ఆమె ఏమాత్రం ఆలోచించకుండా దారుణానికి పాల్పడింది. అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టింది. మంటల్లో కాలుతూ అతడు హాహాకారాలు చేయసాగాడు.

ఆ అరుపులు విన్న కొందరు ఇంటి లోపలికి వచ్చారు. మంటలు ఆర్పి సంజయ్‌ని ఆస్పత్రికి తరలించారు. తర్వాత అతడ్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ సంజయ్‌ చనిపోయాడు. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాణిని అదుపులోకి తీసుకుని విచారించారు. రాణి ఈ సంఘటనపై మాట్లాడుతూ ఇదో హఠాత్పరిణామం అని అనటం గమనార్హం. కాగా, వివాహేతర సంబంధానికి ఓ నిండు ప్రాణం బలి అయింది.

ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా మనుషుల్లో మార్పు రావటం లేదు. తెలిసికూడా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులకు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారు. ఇందుకు ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. మరి, అనుమానంతో ప్రశ్నించాడన్న కోపంతో ప్రియురాలు ప్రియుడ్ని చంపిన ఈ సంఘనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments