iDreamPost
android-app
ios-app

Bellamkonda Sai Sreenivas: పంథా మార్చిన బెల్లంకొండ.. బాలయ్య, విశ్వక్ బాటలో!

  • Published Jul 12, 2024 | 6:33 PM Updated Updated Jul 12, 2024 | 6:33 PM

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తున్నాడు. దేనికదే ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు. రూట్ మార్చి కథలను ఎంపికచేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య, విశ్వక్ సేన్ బాటలో అతడు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తున్నాడు. దేనికదే ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు. రూట్ మార్చి కథలను ఎంపికచేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య, విశ్వక్ సేన్ బాటలో అతడు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 12, 2024 | 6:33 PMUpdated Jul 12, 2024 | 6:33 PM
Bellamkonda Sai Sreenivas: పంథా మార్చిన బెల్లంకొండ.. బాలయ్య, విశ్వక్ బాటలో!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. టాలీవుడ్ లో హిట్ కోసం పోరాడుతున్న హీరోల్లో ఒకడు. బాలీవుడ్ లో సత్తాచాటుదామని వెళ్లిన ఈ యంగ్ హీరోకి అక్కడ చుక్కెదురు అయ్యింది. దాంతో పూర్తిగా టాలీవుడ్ పైనే దృష్టిపెట్టాడు. వరుసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయాడు. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టాడు. అయితే ఆ లిస్ట్ చూస్తూ.. బెల్లంకొండ పూర్తిగా తన పంథా మార్చినట్లు కనిపిస్తున్నాడు. అదీకాక నందమూరి బాలకృష్ణ, యంగ్ హీరో విశ్వక్ సేన్ బాటలో నడుస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. మరి ఈ కథేంటో తెలుసుకుందాం పదండి.

బాలీవుడ్ ప్లాన్స్ బెడిసికొట్టడంతో.. పూర్తిగా టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకెళ్తున్నాడు. భీమ్లానాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ అనే మూవీని అనౌన్స్ చేశాడు. ఇది షూటింగ్ దశలో ఉండగానే.. మరో మూవీని పట్టాలెక్కించాడు. ‘చావుకబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో ‘BSS 11’ మూవీని ప్రకటించారు. ఈ రెండు లైన్లో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్ కు శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

లుధీర్ అనే కొత్త దర్శకుడితో తన 12వ చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ నచ్చడంతో గత రెండేళ్లుగా ఈ టీమ్ తో ప్రయాణం చేస్తున్నాడట ఈ యంగ్ హీరో. సాయి శ్రీనివాస్ కెరీర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ మూవీ అని తెలుస్తోంది. చందు మహేశ్, సాయి శశాంక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి ‘హైందవ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నాట. ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ మూవీలో శ్రీనివాస్ అఘోర పాత్రలో కనిపించనున్నట్లు వినికిడి. దాంతో బెల్లంకొండ తన పంథా పూర్తిగా మార్చాడని స్పష్టంగా అర్ధం అవుతోంది. టైసన్ నాయడు మూవీలో పోలీస్, కౌశిక్ తో చేస్తున్న మూవీ హర్రర్ మిస్టరీ, హైందవలో అఘోరా పాత్రలో.. ఇలా దేనికదే ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే బాలయ్య, విశ్వక్ సేన్ బాటలో శ్రీనివాస్ నడుస్తున్నాడు. అఖండలో అఘోర గెటప్ లో కనిపించి అందరిని షాక్ కు గురిచేశాడు బాలకృష్ణ. ఇక గామీ చిత్రంలో అఘోర పాత్రలో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించి.. ఆకట్టుకున్నాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. మరి ఇప్పుడు సాయి శ్రీనివాస్ కూడా అఘోర క్యారెక్టర్ లో ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. మరి రూట్ మార్చి సినిమాలు చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş