iDreamPost
android-app
ios-app

మార్చి 30న లెజెండ్ రీరిలీజ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు బోయపాటి, బాలయ్యా బాబు కాంబినేషన్లో సంచలనం సృష్టించిన సినిమా లెజెండ్. అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సినిమా పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో రీరిలీజ్ కానుంది. ఇంతకి ఎప్పుడంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు బోయపాటి, బాలయ్యా బాబు కాంబినేషన్లో సంచలనం సృష్టించిన సినిమా లెజెండ్. అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సినిమా పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో రీరిలీజ్ కానుంది. ఇంతకి ఎప్పుడంటే..

మార్చి 30న లెజెండ్ రీరిలీజ్

2014, మార్చి 28న లెజెండ్ సినిమా రిలీజైంది. అంటే రమారమి పదేళ్ళు పూర్తయింది ఆ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాకి. బోయపాటి, బాలయ్యా కాంబినేషన్లో వచ్చిన పెద్ద బాక్సాఫీసు భూకంపం లెజెండ్. బోయపాటి మోస్ట్ పవర్ ఫుల్ డైలాగులు, తనవైన మార్కు సీన్లు, ఎమోసనల్ అవుట్ బరస్ట్….అన్నీ కలగలిపి లెజెండ్ పూనకాలు తెప్పించింది. ఇంతకుంముందు 2010లో వచ్చిన బోయపాటి, బాలయ్యా కాంబో ఫిల్మ్ సింహా వాళ్ళని బాగా మేచ్ చేసింది. ఫేన్స్ కి చాలా కిక్కు ఇచ్చిన సినిమాగా సింహా కూడా సంచలనం రేపింది. కాకపోతే, సింహా తర్వాత ఈ కాంబో రిపీట్ కావడానికి నాలుగేళ్ళు పట్టింది. మధ్యలో బోయపాటి చేసిన సినిమాల కన్నా కూడా లెజెండ్ దుమ్ము లేపిన సినిమాగా బోయపాటికి తిరుగులేని డిమాండ్ ని క్రియేట్ చేయడమే కాదు, అత్యున్నత దర్శకుడిగా కూడా అగ్రసింహాసనం వేసిందనే చెప్పాలి.

లెజెండ్ సినిమా పదేళ్ళవుతున్న సందర్భంగా మార్చి 30వ తేదీన రిరిలీజ్ కాబోతుందన్న వార్తతో బాలయ్య, అండ్ బోయపాటి ఫేన్స్ పండగ చేసుకుంటున్నారు. లెజెండ్ పెట్టిన రికార్డులు అలాటిలాటివి కావు. బాక్సాఫీసుని బద్దలు చేసిన రికార్డులు. 31 సెంటర్లలో 100 డేస్, రెండు సెంటర్స్ లో 175 డేస్, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో డైరెక్ట్ షోలతో 200 డేస్, కడప జిల్లా పొద్దుటూరులో షిఫ్టులతో 200 డేస్ ఆడింది. అక్కడే 275 డేస్ కూడా కంప్లీట్ చేసుకుంది. ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా తర్వాత 200 దేస్ రికార్డు కొట్టిన సినిమా లెజెండే. కర్నూలులో రెండు ధియేటర్లలో డైరెక్ట్ 4 షోలతో 365 డేస్ అడిన సినిమా లెజెండ్ ఒక్కటే. పొద్దుటూరులో రెండు ధియేటర్లలో కలిపి 1000రోజులు ఆడిన ఘనతని లెజెండ్ చేజిక్కించుకుంది. ఉత్తమ నటుడిగా బాలయ్య, ఉత్తమ దర్శకుడిగా బోయపాటి, ఉత్తమ సహాయనటుడిగా జగపతిబాబు, ఉత్తమ యాక్షన్ కి రామ్ లక్ష్మణ్ అనేక వేదికల మీద అవార్డులు గెలుచుకున్నారు.

Legend rereleases on March 30 01

కెరీర్లో హీరోగా జగపతిబాబు కనుమరుగవుతున్న తరుణంలో బోయపాటి చెక్కిన క్యారెక్టర్ తో జగపతిబాబు మళ్ళీ కెరీర్లో పవర్ఫుల్ క్యారెక్టర్ అర్ఢిస్టుగా దూసుకుపోయారు. లెజెండ్ సినిమా బాలయ్యని ఒక ట్రెండింగ్ హీరోగా మళ్ళమళ్ళీ నిరూపించింది. బోయపాటి మార్కు సినిమాగా లెజెండ్ ముద్ర పడడమే కాకుండా, బోయపాటికి దర్శకుడిగా ఓ సెన్సేషనల్ మార్కెట్ ని సైతం లెజెండ్ సినిమా అందించింది. దానాదీనా, బాలయ్య మాస్టర్ పీసుల్లో లెజెండ్ సినిమా పెద్దపెట్టున గర్జించి, బాలయ్యని అన్ స్టాపబుల్ గా నిలబెట్టింది. తెలుగు రాష్ట్రాలలో 700 ధియేటర్లలో విడుదలైతే, మొత్తం ప్రపంచమంతా కలిపి 1200 ధియేటర్లలో రిలీజయింది లెజెండ్.