iDreamPost
android-app
ios-app

ఇది కదా క్రేజీ కాంబో! వెంకీ హీరోగా వేణు సినిమా?

  • Published Oct 13, 2023 | 9:33 AM Updated Updated Oct 13, 2023 | 11:54 AM
  • Published Oct 13, 2023 | 9:33 AMUpdated Oct 13, 2023 | 11:54 AM
ఇది కదా క్రేజీ కాంబో! వెంకీ హీరోగా వేణు సినిమా?

ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఎవరు ఊహించలేరు. కొన్నిసార్లు అనుకున్న కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. మరికొన్నిసార్లు అసలు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా కాంబినేషన్స్ కుదురుతాయి. అన్నిసార్లు అనుకున్నవే జరగవు కదా.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబో గురించి ప్రచారం జోరుగా జరుగుతుంది. అదే విక్టరీ వెంకటేష్, బలగం వేణు కాంబినేషన్. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా సైందవ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను.. సైందవ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.

ఇక సైందవ్ తర్వాత వెంకటేష్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరోవైపు కమెడియన్ గా స్థిరపడి.. ఈ ఏడాది దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు టిల్లు వేణు. బలగం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వేణు దర్శకుడిగా డెబ్యూ చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయం సాధించి.. వేణుకు దర్శకుడిగా సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో వేణు తదుపరి సినిమా ఏ హీరోతో చేయబోతున్నాడు? అని అందరు మాట్లాడుకుంటున్నారు. బలగం మూవీ జనాల మనసులు గెలుచుకోవడమే కాకుండా పలు అవార్డులు సైతం అందుకుంది.

కట్ చేస్తే.. ఇప్పుడు వెంకటేష్ తో వేణు సినిమా అని ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం ఊపందుకుంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు గానీ.. కాంబినేషన్ పేర్లు వినగానే ఫ్యాన్స్ దాదాపు థ్రిల్ అయ్యారని చెప్పవచ్చు. ఒకప్పుడు వెంకటేష్ సినిమాలో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన వేణు.. ఇప్పుడు వెంకటేష్ ని డైరెక్ట్ చేయనున్నాడని తెలిసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలని.. వీరి కాంబినేషన్ లో సినిమా రావాలని దగ్గుబాటి ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ప్రస్తుతం కాంబో సెట్ అయ్యిందని అంటున్నారు. కానీ.. ఏ బ్యానర్.. ఏంటి? అసలు కన్ఫర్మ్ అయ్యిందా లేదా అనే వివరాలు తెలియాల్సి ఉంది. మరి వెంకీ – వేణు కాంబోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss