Ratna Pathak Shah: కూతురి వయసున్న వాళ్లతో రొమాన్స్ ఏంటి? కొంచెమైనా సిగ్గుండాలి: సీనియర్ నటి

కూతురి వయసున్న వాళ్లతో రొమాన్స్ ఏంటి? కొంచెమైనా సిగ్గుండాలి: సీనియర్ నటి

  • Author Soma Sekhar Updated - 11:59 AM, Fri - 3 November 23
  • Author Soma Sekhar Updated - 11:59 AM, Fri - 3 November 23
కూతురి వయసున్న వాళ్లతో రొమాన్స్ ఏంటి? కొంచెమైనా సిగ్గుండాలి: సీనియర్ నటి

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు, హాస్యనటులకు ఇతర నటీ, నటులకు ఏజ్ అయిపోతుందేమో గానీ.. హీరోలకు మాత్రం వయసు అయిపోదు. వారికి 60, 70 సంవత్సరాలు వచ్చినా కూడా నటిస్తూనే ఉంటారు. ఇది ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని వుడ్స్ లోనూ ఉంది. ఇక హీరోలకు, హీరోయిన్స్ కు మధ్య కొన్ని సినిమాల్లో ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లు మనకు కనిపిస్తూనే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు తమ కూతురి వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో చాలా మంది తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ సీనియర్ నటి కూతురు వయసున్న హీరోయిన్స్ తో రోమాన్స్ చేయడానికి సిగ్గుండాలి అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది.

చిత్ర పరిశ్రమలో కథకు తగ్గ పాత్రల్లో నటీ, నటులు నటించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హీరోలు చిన్న ఏజ్ ఉన్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేయాల్సి వస్తుంది. ఇది కొన్ని కొన్ని సార్లు అభిమానులకు మింగుడుపడదు. ఇదే విషయం గురించి తాజాగా మాట్లాడింది సీనియర్ నటి రత్న పాఠక్ షా. తాజాగా ఓ మీడియాతో ఈ విధంగా మాట్లాడింది. “కూతురి వయసున్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడానికి వారికి ఏ మాత్రం సిగ్గుగా అనిపించడం లేదు. దీని గురించి ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. అలా నటించే వారికే సిగ్గులేనప్పుడు నేనేం మాట్లాడగలను. నేను చెప్పడానికి ఏం లేదు. ఈ విషయం గురించి మాట్లాడ్డానికి నాకే సిగ్గుగా ఉంది” అంటూ ఘాటుగా స్పందించింది.

అయితే కచ్చితంగా ఏదో ఒక రోజు మార్పు వస్తుందని ఆమె తెలిపారు. ఆడవారు కూడా ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని, వారు ఇండస్ట్రీలో అద్భుతాలు చేయగలరని ఆమె చెప్పుకొచ్చారు. కాగా.. రత్న పాఠక్ షా.. ఖుబ్సూరత్, కపూర్ అండ్ సన్స్, లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. మరి ఈ సీనియర్ నటి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments