iDreamPost
android-app
ios-app

Sai Rajesh: బేబి దర్శకుడుకి వింత అనుభవం.. ఇంటికి భోజనానికి పిలిచి..

  • Published Jul 06, 2024 | 11:27 AM Updated Updated Jul 06, 2024 | 11:32 AM

దర్శకుడు సాయి రాజేశ్ ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. కాగా, గతేడాది బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి రాజేశ్ ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో తాజాగా సాయి రాజేశ్ కు ఓ స్నేహితుడి వల్ల వింత అనుభవం ఎదురైంది. ఇక ఆ విషయాన్ని స్వయంగా సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్టు చేశారు.

దర్శకుడు సాయి రాజేశ్ ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. కాగా, గతేడాది బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి రాజేశ్ ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో తాజాగా సాయి రాజేశ్ కు ఓ స్నేహితుడి వల్ల వింత అనుభవం ఎదురైంది. ఇక ఆ విషయాన్ని స్వయంగా సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్టు చేశారు.

  • Published Jul 06, 2024 | 11:27 AMUpdated Jul 06, 2024 | 11:32 AM
Sai Rajesh: బేబి దర్శకుడుకి వింత అనుభవం.. ఇంటికి భోజనానికి పిలిచి..

టాలీవుడ్ దర్శకుడు ‘సాయి రాజేశ్’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. గతేడాది బేబి ఈ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి తనదైన మార్క్ ను వేసుకున్నాడు సాయి రాజేశ్. కాగా, ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇకపోపోతే టీనేజ్ లవ్ స్టోరితో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన బేబి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇంతకు ముందు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహారించడమే కాకుండా.. దర్శకుడుగా కూడా హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి సినిమాలు తెరకెక్కించిన అవేమి సాయి రాజేశ్ అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.

కానీ, ఆ తర్వాత తీసిన కలర్ ఫోటో వంటి ఎమోషనల్ లవ్ స్టోరికి మాత్రం స్క్రిప్ట్ అందించి రచయితగా, దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత తీసిన బేబి సినిమాతో రికార్డును సృష్టించడమే కాకుండా.. దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతానికి సాయి రాజేశ్ కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ దర్శకుడుకి తన స్నేహితుడి ఫ్రెండ్ వలన వింత అనుభవం ఎదురైంది. ఇక దాని కోసం స్వయంగా సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

బేబి దర్శకుడు సాయి రాజేశ్ ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే తాజాగా ఈ దర్శకుడికి తన స్నేహితుడి వలన వింత అనుభావం ఎదురైంది. ఇక ఆ విషయాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. కాగా, ప్రస్తుతానికి ఆ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఆ పోస్టులో సాయి రాజేశ్ ఇలా రాసుకొచ్చారు. ‘నిన్న ఒక స్నేహితుడు బలవంతం మీద నేను తన ప్రాణ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాను. నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం, 50 సార్లు చూసుంటాడు, ఇన్నేళ్ల మా స్నేహం లో ఏది ఆడగలేదు, నిన్ను భోజనానికి తీసుకురమ్మన్నాడు’ అని అన్నాడు. సరే మనకి ఈ చపాతీలు,రోటీలు మొత్తింది. కాస్త హోమ్ ఫుడ్ తినవచ్చు అని వెళ్లాను. ఇక అక్కడ 10 రకాల వంటలు, అద్భుతమైన ఆతిథ్యంతో పాటు.. ఎంత గొప్ప సినిమా సర్ అని వాళ్ల ఆవిడకి, పక్కింటి వాళ్లకి, గేట్ దగ్గర వాచ్ మాన్‌కి, కొరియర్ బాయ్‌కి, సార్‌తో సెల్ఫీ దిగండి, ‘బేబీ సినిమా డైరెక్టర్’ అని 30 ఫోటో లు ఇప్పించారు.

అయితే ఒక గంట తర్వాత ప్లేట్ లో గారెలు, నాటుకోడి పులుసు వడ్డించారు. అప్పుడు నా స్నేహితుడి ఫ్రెండ్ ”మా అమ్మాయికి సమంత అంటే చాలా ఇష్టమండి. ఆమెతో ఒక ఫోటో ఇప్పించండి, మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తున్నారు ఆమెతో” అని అన్నాడు. కానీ, ఇంత జరిగినా గారెలు సిగ్గు లేకుండా లోపలకి వెళ్లిపోయినాయి. ఓ బేబి అంటూ సాయి రాజేశ్ రాసుకొచ్చాడు. అయితే ఇక్కడ అసలు విషయమేమిటంటే.. గతంలో సమంత ప్రధాన పాత్రలో ‘ఓ బేబీ’ అనే సినిమా వచ్చింది. ఇక తర్వాత సాయి రాజేశ్ ‘బేబి’ ఓ మూవీ తీశాడు. ఈ రెండింటి విషయంలో పొరబడ్డ డైరెక్టర్ ఫ్రెండ్‌ ఫ్రెండ్ సాయి రాజేశ్ పెద్ద షాకిచ్చాడు. అక్కడ ఏం చెప్పాలో తెలీక ఇలా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి అందరినీ నవ్వించే విధంగా ఫన్నీ ఫోస్టు పెట్టాడు. ఇక ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి, సాయి రాజశ్ కు ఎదురైనా ఆ వింత ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sai Rajesh (@sairazesh)

Jojobet GirişmeritbetmeritbetjojobetCasibom girişjojobetJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibom