iDreamPost
android-app
ios-app

Vaishnavi Chaitanya: సిద్దు సరసన బేబీ బ్యూటీ వైష్ణవి.. పోస్టర్ అదిరిపోయింది!

  • Published Jan 04, 2024 | 4:00 PM Updated Updated Jan 18, 2024 | 6:19 PM

గత ఏడాది విడుదలైన చిత్రాల్లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన చిన్న చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్.. కీ రోల్స్ చేశారు. చిన్న సినిమా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ వైష్ణవి యాక్టింగ్ సూపర్బ్. ఇప్పుడు ఈ అమ్మడు..

గత ఏడాది విడుదలైన చిత్రాల్లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన చిన్న చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్.. కీ రోల్స్ చేశారు. చిన్న సినిమా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ వైష్ణవి యాక్టింగ్ సూపర్బ్. ఇప్పుడు ఈ అమ్మడు..

  • Published Jan 04, 2024 | 4:00 PMUpdated Jan 18, 2024 | 6:19 PM
Vaishnavi Chaitanya: సిద్దు సరసన బేబీ బ్యూటీ వైష్ణవి.. పోస్టర్ అదిరిపోయింది!

గత ఏడాది చిన్న సినిమా వచ్చి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న చిత్రం బేబి. కల్ట్ మూవీగా వచ్చిన ఈ మూవీ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి విదితమే. బ్లాక్ బస్టర్ కల్ట్ బొమ్మగా నిలిచిన ఈ చిత్రంలో ఆనంద్ దేవర కొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించగా.. యూట్యూబర్, షార్ట్ ఫిల్మిం హీరోయిన్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ మూవీ మొత్తం వైష్ణవి చుట్టూనే తిరుగుతుంది. అంతలా ఆ మూవీ ఆకట్టుకోవడానికి వైష్ణవి చైతన్య నటనే ప్రధాన కారణం. విమర్శలు వస్తాయని తెలిసినా కూడా ఈ మూవీలో నటించింది. అందులో వైష్ణవి నటనను చూసి ప్రేమలో మోసపోయిన కుర్రాళ్లు తిట్టిపోశారు. ఇక మెగాస్టార్ చిరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తూనే.. వైష్ణవి నటనకు కొనియాడారు.

బేబి మూవీని సాయి రాజేశ్ దర్శకత్వం వహించగా.. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ తెరకెక్కించారు. ఈ మూవీ తర్వాత వైష్ణవి మంచి ఆఫర్లను కొల్లగొడుతుందని చెప్పాడు నిర్మాత. అనుకున్నట్లే వరుస పెట్టి ఆఫర్లను అందుకుంటుంది ఈ భామ. మరోసారి ఆనంద్ దేవర కొండతో కలిసి ఓ మూవీలో యాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత.. దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర బ్యానర్ నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీని అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటో‌గ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ మూవీని హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పుడు మరో మూవీలో కన్ఫమ్ అయ్యింది వైషూ.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ) బ్యానర్ పై తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. వైష్ణవి చైతన్య పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను పంచుకుంది. ఇందులో బ్లాక్ అవుట్ ఫిట్‌లో పిచ్చెక్కిస్తోంది. ఇది కూడా ఉమెన్ సెంట్రిక్ మూవీగా కనిపిస్తోంది. ఈ సినిమా కథ కూడా ఆమె చుట్టూ అల్లుకున్నట్లు తెలుస్తోంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా.. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యహరిస్తున్నారు. ప్రజెంట్ ఆమె లుక్స్ సంబంధించిన పోస్టర్.. సినిమాపై చర్చించుకునేలా చేశాయి. మరీ ఈ మూవీ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sri Venkateswara Cine Chitra (SVCC) (@svccofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetvakti girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş