iDreamPost
android-app
ios-app

బాహుబలి-3 కన్ఫర్మ్! మూవీ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనట!

  • Author singhj Published - 03:06 PM, Mon - 24 July 23
  • Author singhj Published - 03:06 PM, Mon - 24 July 23
బాహుబలి-3 కన్ఫర్మ్! మూవీ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనట!

‘బాహుబలి’.. తెలుగు సినిమా గతిని మార్చిన చిత్రం. ఏడాదికి వందకు పైగా చిత్రాలు రూపొందుతున్నప్పటికీ టాలీవుడ్​కు నేషనల్​ వైడ్​గా ఉన్న ఇమేజ్ తక్కువే. అంతర్జాయ స్థాయిలో మన సినిమాల ఊసే ఉండేది కాదు. అలాంటి టైమ్​లో ఒకే ఒక్క చిత్రంతో అంతా మార్చేశారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తీసిన ‘బాహుబలి’ పాన్ ఇండియా హిట్​గా నిలిచింది. ఈ మూవీని స్ఫూర్తిగా తీసుకొని ఆ తర్వాత ఎన్నో ప్రాంతీయ భాషా చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో రిలీజై సంచలనం సృష్టించాయి. ‘బాహుబలి’కి సీక్వెల్​గా వచ్చిన ‘బాహుబలి 2’ మొదటి పార్ట్​ను మించిన స్థాయిలో విజయాన్ని అందుకుంది.

‘బాహుబలి 2’తో స్వదేశీ ప్రేక్షకులతో పాటు ఫారిన్ ఆడియెన్స్​ను కూడా మెప్పించారు జక్కన్న. ఈ సినిమా జపాన్​లో రిలీజై బ్లాక్​ బస్టర్​గా నిలిచింది. దీంతో రాజమౌళి క్రేజ్ ఖండాంతరాలకు వ్యాపించింది. అయితే ‘బాహుబలి 2’కు కొనసాగింపు ఉంటుందని ఒక సందర్భంలో రాజమౌళి తండ్రి, ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. స్వయంగా జక్కన్న కూడా ‘బాహుబలి 3’ ఉంటుందన్నారు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్​ పైకి వెళ్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. కానీ రాజమౌళి మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఈ సినిమా రిలీజై ఏడాది దాటిపోయింది.

ప్రస్తుతం సూపర్​స్టార్ మహేష్​ బాబుతో చేయాల్సిన సినిమాపై రాజమౌళి దృష్టి పెడుతున్నారు. ఈ తరుణంలో అనూహ్యంగా మరోమారు ‘బాహుబలి 3’పై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మహేష్​తో చేయాల్సిన చిత్రం పూర్తి కాగానే ‘బాహుబలి 3’ని రాజమౌళి పట్టాలెక్కిస్తారని నెట్టింట బలంగా వినిపిస్తోంది. ‘బాహుబలి 2’కు కొనసాగింపుగా కాకుండా కొత్త కథతో సీక్వెల్​ను తీస్తారని టాక్. ఈ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ పనుల్ని వచ్చే ఏడాది మొదలుపెట్టాలని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది ప్రొడక్షన్ హౌస్ లేదా రాజమౌళి నుంచి కన్ఫర్మేషన్ వస్తే గానీ చెప్పలేం. మరి.. ‘బాహుబలి 3’ కోసం మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet