iDreamPost
android-app
ios-app

Avantika Vandanapu: కెరీర్‌లో స్పీడ్ పెంచిన అవంతిక వందనపు! నటిగా అదుర్స్ అనిపిస్తూ!

  • Published Aug 09, 2024 | 8:20 PM Updated Updated Aug 09, 2024 | 8:20 PM

Avantika Vandanapu Speed Up Her Career: చిన్న వయసులోనే హాలీవుడ్ సినిమాల్లో సత్తా చాటేస్తుంది. తెలుగు అమ్మాయి అయిన అవంతిక వందనపు అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. నటిగా అదుర్స్ అనిపిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది.

Avantika Vandanapu Speed Up Her Career: చిన్న వయసులోనే హాలీవుడ్ సినిమాల్లో సత్తా చాటేస్తుంది. తెలుగు అమ్మాయి అయిన అవంతిక వందనపు అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. నటిగా అదుర్స్ అనిపిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది.

Avantika Vandanapu: కెరీర్‌లో స్పీడ్ పెంచిన అవంతిక వందనపు! నటిగా అదుర్స్ అనిపిస్తూ!

అవంతిక వందనపు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. ప్రస్తుతం యూత్ అందరికీ ఫేవరెట్ యాక్ట్రెస్ అయిపోయింది. ‘అమ్మ చేసింది మిస్.. లైట్ గానే ఉంటుంది’ అనే డైలాగ్ తో పాపులర్ అయిన అవంతిక వందనపు ఇప్పుడు చాలా మారిపోయింది. 2016లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమాలో ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది అనేది కంపేర్ చేస్తే అస్సలు పోలిక లేదు. అప్పటికీ, ఇప్పటికీ చాలా పరిపక్వత వచ్చింది. మన తెలుగమ్మాయి ఇప్పుడు హాలీవుడ్ లో సత్తా చాటుతుంది. అది కూడా అతి చిన్న వయసులో. తెలుగులో బ్రహ్మోత్సవం తర్వాత, మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాల్లో నటించింది. కోలీవుడ్ లో భూమిక అనే సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

హాలీవుడ్ లో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది అవంతిక కల. ఆ కలను హాలీవుడ్ లో నటించడం ద్వారా నెరవేర్చుకుంది. మొదట కొన్ని టెలివిజన్ సిరీస్ లలో అవకాశం అందిపుచ్చుకుని ఆ తర్వాత తన టాలెంట్ తో సినిమా అవకాశాలను దక్కించుకుంది. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే స్థాయి నుంచి కీలక పాత్రలు చేసే స్థాయికి ఎదిగింది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘మీన్ గర్ల్స్’ అనే సినిమాతో తన ప్రతిభతో ఒక్కసారిగా ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. తెలుగు వాళ్ళు అయితే అవంతిక పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయారు. ఏంటి మన తెలుగమ్మాయా? హాలీవుడ్ సినిమాలో మెరిసిందా? అని షాక్ కి గురయ్యారు. మీన్ గర్ల్స్ సినిమాలో పాటకు అవంతిక ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కి, చేసిన డ్యాన్స్ కి యూత్ మొత్తం ఉర్రూతలూగిపోయింది. ఆ సినిమా ఘన విజయంతో అవంతిక వందనపు పేరు హాలీవుడ్ లోనూ మార్మోగిపోయింది. ఆ తర్వాత టారట్ అనే సూపర్ నేచురల్ హారర్ సినిమాలో నటించింది.

ఈ మూవీ జూలై 4న నెట్ ఫ్లిక్స్ లో ఓటీటీలో రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో అవంతిక నటనలో పరిణతి కనబర్చింది. అవంతిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా, సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ.. తనలో ఉన్న కొత్త అవంతికను పరిచయం చేస్తూ వెళ్తుంది. ప్రతి సినిమాకి ఒక కొత్త కథతో, కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను ఆకర్షిస్తుంది. సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటున్న అవంతిక.. ప్రస్తుతం మరో హాలీవుడ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉందని తెలుస్తోంది. కెరీర్ పరంగా చిన్న వయసులోనే మంచి సబ్జెక్ట్స్ తో దూసుకుపోతుంది. నటిగా సత్తా చాటుతుంది. ఒక తెలుగు అమ్మాయి అవంతిక హాలీవుడ్ లో మంచి సినిమాలతో దూసుకుపోవడం అనేది గొప్ప విషయమే. మరి హాలీవుడ్ లో దూసుకుపోతున్న అవంతిక వందనపు తెలుగు రీఎంట్రీ కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.