iDreamPost
android-app
ios-app

ఇంటింటి రామాయణం సీరియల్ హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా..?

బుల్లితెరపై కన్నడ హీరోయిన్ల హవా కొనసాగుతున్న ఈ క్రమంలో అచ్చ తెలుగు అమ్మాయి గట్టి పోటీనిస్తుంది. ఉమెన్ సెంట్రిక్ సీరియల్స్ కు కేరాఫ్ అడ్రస్. ఆ ఛానల్ లేదు.. ఈ ఛానల్ లేదు.. అన్నింట్లోనూ వర్క్ చేసింది పల్లవి రామిశెట్టి.. ఆమె బ్యాగ్రౌండ్ చూస్తే...

బుల్లితెరపై కన్నడ హీరోయిన్ల హవా కొనసాగుతున్న ఈ క్రమంలో అచ్చ తెలుగు అమ్మాయి గట్టి పోటీనిస్తుంది. ఉమెన్ సెంట్రిక్ సీరియల్స్ కు కేరాఫ్ అడ్రస్. ఆ ఛానల్ లేదు.. ఈ ఛానల్ లేదు.. అన్నింట్లోనూ వర్క్ చేసింది పల్లవి రామిశెట్టి.. ఆమె బ్యాగ్రౌండ్ చూస్తే...

ఇంటింటి రామాయణం సీరియల్ హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా..?

ఈ మధ్య కాలంలో బిగ్ స్క్రీన్ పైనే కాదు బుల్లితెరపై సత్తా చాటుతున్నారు కన్నడ కస్తూరీలు. ఏ సీరియల్ చూసినా శాండిల్ వుడ్ భామలదే హవా. కానీ ఇంత పోటీలోనూ తన సత్తా చాటుతుంది అచ్చ తెలుగు అమ్మాయి పల్లవి రామిశెట్టి. ఎన్నో ఏళ్ల నుండి సీరియల్లో కీ రోల్ ప్లే చేస్తూ.. స్మాల్ స్క్రీన్ పై క్వీన్‌లా మారిపోయింది. పెళ్లి, బాబు తర్వాత కాస్తంత గ్యాప్ తీసుకుని మళ్లీ క్యాచీ కథనంతో మన ముందుకు వస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్లో పెద్ద కోడలిగా కనిపిస్తుంది. స్టార్ మాలో జూన్ 10 నుండి ప్రారంభమైన ఈ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9.30 గంటలకు ప్రసారం అవుతుంది. ఇందులో అవని పాత్రలో మెస్మరైజ్ చేస్తుంది మన హీరోయిన్ పల్లవి రామిశెట్టి.

ఒకప్పుడు ఈటీవీ ఆస్థాన నటిగా ఉన్న పల్లవి.. ఇప్పుడు అన్ని ఛానల్స్‌లోనూ కనిపిస్తోంది. ఆమె కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో పుట్టింది. అయితే తండ్రి వ్యాపార రీత్యా మారడంతో బెంగళూరు, హైదరాబాద్‌లో చదువుకుంది. ఉప్పల్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న సమయంలోనే ఆమె ఈటీవీలో ఆడిషన్స్‌కు వెళ్లి సెలక్ట్ అయ్యింది. అలా రంగుల కళ అనే కార్యక్రమానికి వ్యాఖ్యతగా కెరీర్ స్టార్ చేసింది. ఆ తర్వాత సీరియల్లో ఆఫర్ వచ్చింది. నీ పేరే నా ప్రేమ ఆమె తొలి సీరియల్. ఆడదే ఆధారం సీరియల్లో అమృత పాత్రలో నటించింది. ఆడదే ఆధారం సాంగ్ వస్తే.. మోస్ట్లీ ఆమెనే కళ్ల ముందు మెదులుతుంది. ఇది లాంగెస్ట్ సీరియల్లో ఒకటిగా నిలిచింది. భార్యామణి సీరియల్లో అలేఖ్య పాత్రలో మెస్మరైజ్ చేసింది. మంచు పల్లకి, ఆకాశగంగ వంటి సీరియల్స్ లో కూడా తన నటనతో ఆకట్టుకుంది.

పల్లవిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన సీరియల్ అత్తారింటికి దారేది. ఈ సీరియల్ చేస్తుండగానే.. జీ తెలుగులో మాటే మంత్రము ధారావాహికలో నటించింది. ఇది కూడా మంచి రేటింగ్‌తో దూసుకెళ్లింది. 2019లో పల్లవి రామిశెట్టికి దిలీప్ కుమార్‌ అనే సాఫ్ట్ వేర్‌తో వివాహం అయ్యింది. ఆ తర్వాత పాపే మా జీవన జ్యోతి సీరియల్ చేసింది. అయితే ఈ షూటింగ్ సమయంలో ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఈ సీరియల్ నుండి క్విట్ అయ్యింది. కేవలం ఇదే కాదు ఏ సీరియల్ ఒప్పుకోలేదు. ఆమెకు ఓ బాబు జన్మించాడు. ఇప్పుడు బాబు కాస్త పెద్ద వాడు కావడంతో మళ్లీ సీరియల్స్‌లో నటిస్తుంది. హడావుడి పడకుండా నెమ్మదిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇంటింటి రామాయణంతో మహిళా ప్రేక్షకులను పలకరిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Pallavi Ramisetty Official (@pallaviramisettyofficial)