iDreamPost
android-app
ios-app

ఆర్య సినిమాలో నటించిన చిన్నారి.. ఇప్పుడు ఈ రేంజ్‌లోనా?

  • Published Mar 30, 2024 | 4:59 PM Updated Updated May 07, 2024 | 5:41 PM

సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తొలి స్టెప్ పడింది ఆర్య మూవీతోనే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదూ.. నంది అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్. ఇదిగో ఈ ఫోటో అందులోదే. ఇందులో బన్నీ తొట్టి గ్యాంగ్ ఉంటుంది గుర్తుందా.. అందులో ఉన్న ఈ చిన్నారి ఎవరంటే..?

సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తొలి స్టెప్ పడింది ఆర్య మూవీతోనే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదూ.. నంది అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్. ఇదిగో ఈ ఫోటో అందులోదే. ఇందులో బన్నీ తొట్టి గ్యాంగ్ ఉంటుంది గుర్తుందా.. అందులో ఉన్న ఈ చిన్నారి ఎవరంటే..?

  • Published Mar 30, 2024 | 4:59 PMUpdated May 07, 2024 | 5:41 PM
ఆర్య సినిమాలో నటించిన చిన్నారి.. ఇప్పుడు ఈ రేంజ్‌లోనా?

లెక్కల మాస్టారు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఆర్య. దర్శకుడిగా సుక్కుకు ఇది తొలి చిత్రం కాగా, బన్నీకి హీరోగా రెండో చిత్రం. డిఫరెంట్ స్టోరీ, కథనం, అల్లు అర్జున్ లుక్స్ అండ్ యాక్టింగ్, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ వెరసి సినిమాను హిట్ ట్రాక్ ఎక్కించడమే కాదూ..బెస్ట్ యాక్టర్‌గా అల్లు వారబ్బాయికి నంది అవార్డును (స్పెషల్ జ్యూరీ) తెచ్చిపెట్టింది. ఉత్తమ దర్శకుడు కేటగిరీలో 52 ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు నంది స్పెషల్ జ్యూరీ అందుకున్నాడు సుకుమార్. రూ. 4 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 2004లో సమ్మర్ హాలీడేస్ సమయంలో రిలీజై రూ. 30 కోట్లు వసూలు చేసింది. మలయాళంలో డబ్ చేస్తే రూ. 30- 35 లక్షల రూపాయలను కొల్లగొట్టడం గమనార్హం. దీంతో అల్లు అర్జున్‌ కాస్త మల్లు అర్జున్‌గా మారిపోయాడు. ఈ సినిమా అనేక భాషల్లో రీమేక్ అయ్యి హిట్ అందుకుంది.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్దపడతాడు. ఆ విషయం తెలియక.. హీరోయిన్ తప్పని సరి పరిస్థితుల్లో మరో హీరో (శివ బాలాజీ)ని ప్రేమించాల్సి వస్తుంది. ఇందులో మన హీరో ఆర్యకు ఓ తొట్టి గ్యాంగ్ ఉంటుంది. పిల్లల గ్యాంగ్ అది. ఇదిగో ఈ ఫోటో కూడా అందులోనే. ఆ పిల్లల గ్యాంగ్‌లో అందరి కన్నా పెద్దగా ఉన్న ఈ పాప గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఆ పాప అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. సందడే సందడి, ఆర్య, ఔనన్నాకాదన్నా చిత్రాల్లో యాక్ట్ చేసి మెప్పించింది. కానీ కొంత విరామం తీసుకుని హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరంటే.. శ్రావ్య. చైల్డ్ ఆర్టిస్టుగా అలరించి… వెంటనే మెయిన్ లీడ్ యాక్టర్ అయిపోయింది. హ్యాపీ డేస్ మూవీ హీరోల్లో ఒకరైన టైసన్ గుర్తున్నాడు కదా.. అతడితో కలిసి యాక్ట్ చేసింది.

లవ్ యు బంగారంలో కనిపించిన ఈ పదహారణాల తెలుగు అమ్మాయి..కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా చేసింది. రోజ్ అనే కన్నడ సినిమాతో పాటు తెలుగులో కాయ్ రాజా కాయ్, సీనియర్ హీరో నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా వచ్చిన నందిని నర్సింగ్ హోం అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. తమిళంలో కూడా పగిరి, విలాయట్టు ఆరంభం వంటి చిత్రాలు చేసింది. 2018లో వచ్చిన వచ్చిన మసకలిలో కనిపించింది ఈ బ్యూటీ. . అయితే ఆమె సోదరి కూడా చైల్డ్ ఆర్టిస్టు కావడం విశేషం. మల్లీశ్వరి సినిమాలో నటించిన చిన్నారి గుర్తుంది కదా.. గ్రీష్మ నేత్రికకు శ్వేత స్వయంగా అక్క అవుతుంది. వీరిద్దరూ కూడా సేమ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యను పూర్తి చేశారు. ప్రస్తుతం శ్రావ్య కొత్త సినిమాలేమీ ఒప్పుకున్న సమాచారం లేదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎప్పటికప్పుడు ట్రిప్స్ ఫోటోస్ పెడుతూ ఉంటుంది. అప్పటి కన్నా ఇప్పుడు మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది బ్యూటీ.

 

View this post on Instagram

 

A post shared by Shravya (@itsshravzshravya)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom