iDreamPost
android-app
ios-app

అమ్మ గురించి యూట్యూబర్ అనుచిత వ్యాఖ్యలు.. హీరో కంప్లయింట్

  • Published Mar 06, 2024 | 4:56 PM Updated Updated Mar 06, 2024 | 4:56 PM

విజయ్ కుమార్ నట వారసుడిగా కొనసాగుతున్నాడు అరుణ్ విజయ్. ఇటీవల మిషన్ ఛాప్టర్ 1తో మెరిశాడు. అమీ జాక్సన్ కథాానాయికగా నటించింది. సంక్రాంతి బరిలో కోలీవుడ్ నాట సందడి చేసిన ఈ మూవీ ఓకే అనిపించింది. అయితే

విజయ్ కుమార్ నట వారసుడిగా కొనసాగుతున్నాడు అరుణ్ విజయ్. ఇటీవల మిషన్ ఛాప్టర్ 1తో మెరిశాడు. అమీ జాక్సన్ కథాానాయికగా నటించింది. సంక్రాంతి బరిలో కోలీవుడ్ నాట సందడి చేసిన ఈ మూవీ ఓకే అనిపించింది. అయితే

  • Published Mar 06, 2024 | 4:56 PMUpdated Mar 06, 2024 | 4:56 PM
అమ్మ గురించి యూట్యూబర్ అనుచిత వ్యాఖ్యలు.. హీరో కంప్లయింట్

సోషల్ మీడియా వచ్చాక స్వేచ్చ పెరిగింది. సామాజిక మాధ్యమాల ద్వారా తమకు నచ్చింది, తోచింది చెబుతున్నారు కొందరు. ఇవి నిజమేనని నమ్మేస్తున్నారు కూడా నెటిజన్లు. ఇదే సమయంలో కొంత మంది సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు.  పని గట్టుకుని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇవి కొన్ని సార్లు హద్దులు దాటేస్తున్నాయి. సినీ సెలబ్రిటీలపైనే కాదూ.. వారి కుటుంబ సభ్యులపై కూడా తప్పుడు వార్తలు సృష్టించి సైకో ఆనందాన్ని పొందుతున్నారు. దీని వల్ల ఆ కుటుంబం మానసికంగా కుంగుబాటుకు గురౌతుంది. తాజాగా ప్రముఖ నటుడి తల్లిపై కూడా ఓ యూట్యూబర్ తప్పుడు ప్రచారం చేశాడు. దీంతో అతడు పోలీసు కేసు నమోదు చేయాల్సి వచ్చింది.

ప్రముఖ కోలీవుడ్, టాలీవుడ్ నటుడు విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కుమారుడు, హీరో అరుణ్ విజయ్.. ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ పై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ ఛానల్ తన గురించి, తన కుటుంబం గురించి తప్పుడు ప్రచారం చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ యూట్యూబ్ ఛానల్లో తన సవతి తల్లి మంజుల, తన తల్లిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని, పరువు నష్టం కలిగించేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే కేసు నమోదు చేసి.. సదరు ఛానెల్‌పై చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, కొన్నాళ్ల క్రితం ఓ తమిళ దిన పత్రిక విజయ్ కుమార్ రెండో భార్య మంజులతో పాటు కొందరు నటీమణులపై అసభ్యకరమైన వార్తలు ప్రచురించగా. .దీనిపై సర్వత్రా విమర్శలు కూడా వచ్చాయి. ఇక విజయ్ కుమార్ మొదట 1969లో ముత్తుకన్ను అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. కవితా, అనిత, అరుణ్ విజయ్.. 1976లో నటి మంజులను విజయ్ కుమార్ రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. వనిత, ప్రీత, శ్రీదేవి. ఈ ముగ్గురు తెలుగు సినిమాల్లో అలరించిన సంగతి విదితమే.  2013లో జాండీస్‌తో బాధపడుతూ మృతి చెందారు మంజుల. తాజాగా వీరి ఇంట్లో శుభకార్యం జరగ్గా.. సందడి చేశారు వీరంతా. ఇక అరుణ్ విజయ్ విషయానికి వస్తే.. ఇటీవల..మిషన్ ఛాప్టర్ 1 మూవీతో అలరించాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş