iDreamPost
android-app
ios-app

సినీ ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ హీరో అజిత్ మూవీ షూటింగ్​లో..!

  • Author singhj Updated - 11:58 AM, Fri - 3 November 23
  • Author singhj Updated - 11:58 AM, Fri - 3 November 23
సినీ ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ హీరో అజిత్ మూవీ షూటింగ్​లో..!

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల వరుస మరణాలు వాళ్ల అభిమానులులను శోకసంద్రంలో ముంచుతున్నాయి. సినీ సెలబ్రిటీలకు ఉండే ఆదరణ, వాళ్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో తెలిసిందే. సెలబ్రిటీలు ఏం చేస్తే అదే చేయాలనుకుంటారు ఫ్యాన్స్. వారి డ్రెస్సింగ్, ఫ్యాషన్ స్టైల్​ను ఫాలో అయిపోతారు. సెలబ్రిటీలు వారి పర్సనల్ లైఫ్​లో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఫ్యాన్స్​కు ఎక్కువగా ఉంటుంది. సినీ సెలబ్రిటీల మీద ఎంత అభిమానం చూపిస్తారో.. వారికి ఏమైనా అయినా అంతే బాధపడతారు ఫ్యాన్స్.

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక తమిళ చిత్రం షూటింగ్​లో ఆర్ట్ డైరెక్టర్ మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. ఆ సినిమా మరెవరిదో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్నది కావడం గమనార్హం. అజిత్ యాక్ట్ చేస్తున్న ‘విడా మయూర్చి’ ఫిల్మ్ షూటింగ్​లో విషాదం జరిగింది. ఆ మూవీకి ఆర్ట్ డైరెక్టర్​గా వ్యహరిస్తున్న మిలాన్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆగుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. అజర్​బైజాన్​లో షూటింగ్ కోసం మేకర్స్ ప్లాన్ చేశారు. దీంతో మూవీ టీమ్ అంతా రీసెంట్​గా అక్కడికి వెళ్లారు.

అజిత్ మూవీ అజర్​బైజాన్​లో షూటింగ్ జరుపుకుంటున్న టైమ్​లో ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారట. కానీ గుండెపోటు రావడంతో అప్పటికే మిలాన్ మృతి చెందారని డాక్టర్లు తెలిపారు. దీంతో ‘విడా ముయార్చి’ సెట్స్​లో విషాదం నెలకొంది. ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ మరణవార్తను కోలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. తమిళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ఆయన ఆర్ట్ డైరెక్టర్​గా సేవలు అందించారు. టాలీవుడ్​లో హీరో గోపీచంద్ నటించిన ‘ఆక్సిజన్’ మూవీకి మిలాన్ పనిచేశారు. తమిళంలో  అజిత్ యాక్ట్ చేసిన ‘బిల్లా’, ‘వేదాళం’ లాంటి చిత్రాలు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి.

ఇదీ చదవండి: ఆ వ్యాధి కారణంగా నరకం అనుభవిస్తున్న రేణు దేశాయ్‌!

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet