iDreamPost
android-app
ios-app

దానికి దూరంగా ఉంటా.. నెటిజన్ ప్రశ్నకు ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ రిప్లయ్!

  • Published Jul 05, 2024 | 2:04 PM Updated Updated Jul 05, 2024 | 2:04 PM

Shalini Pandey: చాలా మంది హీరోయిన్లు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. కొందరికి చాలా సినిమాల్లో చేస్తే కానీ క్రేజ్ రాదు. మరికొందరికి మాత్రం ఒక్కే ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ తెచ్చుకుంటారు. అలాంటి వారిలో ఒకరు అర్జున్ రెడ్డి హీరోయిన్.

Shalini Pandey: చాలా మంది హీరోయిన్లు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. కొందరికి చాలా సినిమాల్లో చేస్తే కానీ క్రేజ్ రాదు. మరికొందరికి మాత్రం ఒక్కే ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ తెచ్చుకుంటారు. అలాంటి వారిలో ఒకరు అర్జున్ రెడ్డి హీరోయిన్.

  • Published Jul 05, 2024 | 2:04 PMUpdated Jul 05, 2024 | 2:04 PM
దానికి దూరంగా ఉంటా.. నెటిజన్ ప్రశ్నకు ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ రిప్లయ్!

చాలా మంది హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. కొందరికి చాలా సినిమాల్లో చేస్తే కానీ క్రేజ్ రాదు. మరికొందరికి మాత్రం ఒక్కే ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ తెచ్చుకుంటారు. ఇంకా చెప్పాలంటే..పదుల సినిమాలు చేసిన రానీ క్రేజ్ ఒక్కసినిమాతోనే సంపాదిస్తారు. అలాంటి బ్యూటీనే షాలిని పాండే. ఇలా చెప్తే చాలా తక్కువ మంది గుర్తు పట్టొచ్చు. అర్జున్ రెడ్డి హీరోయిన్ అంటే మాత్రం అందరు గుర్తు పడతారు. తాజాగా ఆమె తన శరీర ఆకృతి గురించి నెటిజన్ అడిగిన ప్రశ్నలకు సూపర్ రిప్లయ్ ఇచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….

షాలినీ పాండే గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ నటించిన మాస్ మూవీ అర్జున్ రెడ్డి సినిమాతో  టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాతో విజయ్ స్టార్‌గా మారిపోతే.. షాలినీకి మాత్రం ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చిన సక్సెస్‌ను షాలీని సరిగ్గా వాడుకోలేకపోయిందని  సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అర్జున్ రెడ్డి సినిమా తరువాత షాలినీ ఎక్కువగా క్రేజ్ దక్కించుకోలేకపోయింది. తెలుగు, తమిళలో అడపా దడపా చిత్రాలు చేస్తూ వచ్చింది. కానీ షాలినీకి మాత్రం అర్జున్ సినిమాతో వచ్చిన క్రేజ్, ఆ స్థాయి ఫాలోయింగ్ ఏర్పడలేదు. ఇటీవలే మహారాజా అంటూ నెట్ ఫ్లిక్స్‌లో అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇది ఇలా ఉంటే.. షాలినీ సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. అప్పుడప్పుడు నెట్టింట్లో తన ఫ్యాన్స్ తో కలిసి ముచ్చట్లు పెడుతుంది.  అలానే నెటిజన్లు అడిగే ప్రశ్నలకు షాలినీ సమాధానాలు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే తనకు  సంబంధించిన అనేక విషయాలను వెల్లడించింది. ఈ భామకు ఎక్కువగా పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఇక ఖాళీ టైమ్ దొరికితే మూగజీవాలతో ఆడుకుంటూ ఉంటుంది. ఈ బ్యూటీ ఫోన్ ఎక్కువగా ఫోన్ ను వినియోగించదట. తాను ఎక్కువగా ఫోన్ వాడనని తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చింది. ఇటీవల షాలినీ పాండే తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేసింది.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ మూవీస్ చేయండి.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నామని ఓ నెటిజన్ షాలినీని అడిగేశాడు. దానికి అర్జున్ రెడ్డి భామ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చింది. అదే విధంగా మరో వ్యక్తి అయితే షాలినీ పాండే బాడీ సైజుల మీద కామెంట్  చేశాడు. ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టాలని, ఫిట్‌గా ఉండాలని ఈ బ్యూటీ సలహాలు ఇస్తోంది. ఎన్ని మెసెజ్‌లు పంపినా చూడటం లేదు అని ఓ నెటిజన్ బాధపడితే.. షాలినీ రిప్లయ్ ఇచ్చింది. “సారీ.. నేను ఎక్కువగా ఫోన్ వాడను. మీ అభిమానం నాకు తెలుస్తోంది.. ఇకపై మరింత యాక్టివ్‌గా ఉండేందుకు ట్రై చేస్తాను” అని షాలినీ పాండే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom