iDreamPost
android-app
ios-app

ఇది అనిరుధ్ టైమే! ఏది కొట్టినా యాక్సెప్ట్ చేసేస్తారా..?

  • Author ajaykrishna Updated - 04:32 PM, Sat - 9 September 23
  • Author ajaykrishna Updated - 04:32 PM, Sat - 9 September 23
ఇది అనిరుధ్ టైమే! ఏది కొట్టినా యాక్సెప్ట్ చేసేస్తారా..?

ఇండస్ట్రీలో ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ట్రెండ్ నడుస్తుందని అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీస్ నుండి మీడియం రేంజ్ మూవీస్ వరకు అందరూ దర్శకనిర్మాతలు అనిరుధ్ నే అప్రోచ్ అవుతున్నారు. ఓ రకంగా ఇండియాలో ఇప్పటికిప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే.. అనిరుధ్ పేరే వినిపిస్తుంది. దళపతి విజయ్ నుండి కమల్ హాసన్, రజినీ దాక అందరి సినిమాలకు అనిరుధ్ వైపే వేలు చూపిస్తున్నారు. మాస్టర్, డాక్టర్, బీస్ట్, విక్రమ్, జెర్సీ, కాతువకుల రెండు కాదల్, డాన్, తిరు.. రీసెంట్ గా జైలర్.. ఇప్పుడు జవాన్.. అన్ని ఇండస్ట్రీని ఊపేసినవే.

అనిరుధ్ మ్యూజిక్.. అని పోస్టర్ పై పేరు కనిపించగానే ఓకే సినిమా ఆల్బమ్ హిట్టు.. సినిమా ఎలా ఉన్నా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. ఏ సినిమాకైనా అనిరుధ్ కావాలి.. అది లవ్ కావచ్చు, మాస్ కమర్షియల్ మూవీ కావచ్చు. సరిగ్గా గమనిస్తే.. అనిరుధ్ ని ఫ్యాన్స్, మ్యూజిక్ లవర్స్ అందరు కలిసి ఒకే సర్కిల్ లోకి నెట్టేస్తున్నారు. ఓకే.. విక్రమ్, బీస్ట్, జైలర్, జవాన్ లాంటి మ్యూజిక్ అందరికీ కావాలి.. అందరిలోనూ జోష్ వస్తుంది. కానీ.. అదే మ్యూజిక్ కి లిరిక్స్ గమనిస్తే.. ఎంతవరకు ధారాళంగా పాడుకోవచ్చు ఎప్పుడైనా గమనించారా!

కొన్నేళ్ల క్రితం.. అనిరుధ్ మ్యూజిక్ లో ప్రతీ మూమెంట్ హార్ట్స్ కి టచ్ అయ్యేది. లిరిక్స్ అన్ని ఈజీగా అర్ధం అయ్యేవి. కానీ.. ఇప్పుడు అనిరుధ్ ని కేవలం మాస్ కమర్షియల్.. హీరో ఎలివేషన్స్ కి తగ్గ మ్యూజిక్ కోసమే సంప్రదిస్తున్నారు. అందుకే విక్రమ్, బీస్ట్, మాస్టర్, జైలర్, జవాన్ సినిమాలలో బయటికి పాడుకోడానికి వీలు లేని సాంగ్స్ వచ్చాయి. ఈ ఆల్బమ్స్ లో సాంగ్స్ అన్ని సూపర్ హిట్. కానీ.. ఏ సింగింగ్ కంపిటేషన్ లో పనికిరావు. యాక్షన్ మూవీస్ అన్నాక ఒకప్పుడు సాంగ్స్ కూడా అర్ధవంతంగా ఉండేవి. ఇళయరాజా, రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్, మణిశర్మ లాంటివారు సాంగ్స్, బిజీఎం సపరేట్ గా అనిపించేవి. కానీ.. అనిరుధ్ సాంగ్స్ కూడా బిజీఎం లాగే ఉంటున్నాయి అనేది ప్రెజెంట్ వినిపిస్తున్న కంప్లైంట్. మరి అనిరుధ్ ఎలా కొట్టినా యాక్సెప్ట్ చేసేద్దామా.. లేకపోతే అర్ధవంతమైన సాంగ్స్ కోరుకుందామా? అని అంటున్నారు మ్యూజిక్ లవర్స్. మరి అనిరుధ్ మ్యూజిక్ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.