iDreamPost
android-app
ios-app

ఓటీటీ ప్రేక్షకులకు పండగ.. యానిమల్‌ నుంచి కీలక అప్‌డేట్‌!

యానిమల్‌ సినిమా డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో చిత్రం విడుదల కానుంది. ఇక, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్‌...

యానిమల్‌ సినిమా డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో చిత్రం విడుదల కానుంది. ఇక, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్‌...

ఓటీటీ ప్రేక్షకులకు పండగ.. యానిమల్‌ నుంచి కీలక అప్‌డేట్‌!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్‌- దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్‌ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో రిలీజ్‌ అవ్వనుంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో యానిమల్‌ను ప్రముఖ తెలుగు నిర్మాత దిల్‌ రాజు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ సినిమాను దిల్‌ రాజు 15 కోట్ల రూపాయలు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది. ఏరియాల వారీగా పెద్ద మొత్తం ఇచ్చి చిత్రాన్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.

యానిమల్‌ ఓటీటీ రిలీజ్‌ విషయానికి వస్తే.. ఇప్పటికే స్ట్రీమింగ్‌ పార్ట్‌నర్‌ ఓకే అయినట్లు తెలుస్తోంది. తెలుగులో ఆహా యానిమల్‌ స్ట్రీమింగ్‌ హక్కుల్ని సొంతం చేసుకుందని సమాచారం. చిత్రం థియేటర్లలోకి వచ్చిన 6నుంచి 8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో విడుదల కానున్న యానిమల్‌ సినిమా నిడివి 3 గంటల 21 నిమిషాలుగా ఉంది. అయితే, ఓటీటీలో మాత్రం నిడివి విషయంలో భారీ మార్పు ఉండనుందట. థియేటర్‌ వర్సన్‌ కంటే ఓ అరగంట ఎక్కువ నిడివితో స్ట్రీమింగ్‌ అవ్వనుందట.

ఇదే గనుక నిజం అయితే.. ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పాలి. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్న సినిమాను ఇంట్లో కూర్చుని ఎంజాయ్‌ చేయవచ్చు. అది కూడా చిత్రం ఎలాంటి బోరుకొట్టనీయకుండా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. అంతేకాదు! అరగంట ఎక్స్‌ట్రా మూవీ గనుక ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయితే.. యానిమల్‌కు పార్ట్‌ 2 ఉండనుందన వార్తలకు బలం చేకూరుతుంది. ఈ సినిమాకు పార్ట్‌ 2 ఉందని మొదటినుంచి ప్రచారం జరుగుతోంది.

మొన్న జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా సినిమా ఎండింగ్‌ను అస్సలు మిస్‌ అవ్వకండి అని అన్నారు. దీంతో సీక్వెల్‌ వార్తలకు రెక్కలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఓటీటీ స్ట్రీమింగ్‌లో సినిమా సాధారణ నిడివి కంటే 30 నిమిషాలు ఎక్కువగా ఉండటం సీక్వెల్‌ వార్తలకు ఊతమిస్తున్నాయి.  కాగా, యానిమల్‌ సినిమాలో రణబీర్‌ కపూర్‌కు జంటగా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా నటించారు. అనిల్‌ కపూర్‌, బాబీడియోల్‌ కీలక పాత్రలు చేశారు.

తండ్రీ కొడుకుల అనుబంధమే ప్రధాన అంశంగా ఈ చిత్రం తెరెకెక్కింది. తండ్రి మీద హత్యా ప్రయత్నం చేసిన వారిపై పగ తీర్చుకునే ఓ కుమారుడి పాత్రలో రణబీర్‌ కనిపించనున్నారు. మూడున్నర గంటల సినిమాలో కేవలం అరగంట మాత్రమే రణబీర్‌ కపూర్‌ అగ్రెసివ్‌గా కనిపించనున్నారట. మిగిలిన మొత్తం ఎమోషన్స్‌తో ఉండనుందట. మరి, యానిమల్‌ సినిమా ఓటీటీలో సాధారణ నిడివి కంటే ఓ అరగంట ఎక్కువగా నిడివితో స్ట్రీమింగ్‌ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.