Venkateswarlu
యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు పలు భాషల్లో ప్యాన్ ఇండియా లెవెల్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే సీక్వెల్‌పై చర్చ జరుగుతోంది...
యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు పలు భాషల్లో ప్యాన్ ఇండియా లెవెల్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే సీక్వెల్‌పై చర్చ జరుగుతోంది...
Venkateswarlu
యానిమల్ సినిమా కోసం రణ్‌బీర్, సందీప్‌రెడ్డి వంగా అభిమానులే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాడు. డిసెంబర్ 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న ఈ మూవీ పాత రికార్డులు తిరగరాస్తుందని యానిమల్ టీం భావిస్తోంది. 1000కోట్లకు పైగా వసూళ్లే లక్ష్యంగా ప్రమోషన్లు చేస్తోంది. సౌత్ ఇండియాపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేస్తోంది సినిమా టీం.
నిన్న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు దర్శక దిగ్గజం ఎస్‌ఎస్ రాజమౌళి, మహేష్ బాబులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. రాజమౌళి యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. రామ్ గోపాల్ వర్మ తర్వాత ట్రెండ్ సెట్ చేస్తున్న వ్యక్తి సందీప్ అంటూ కొనియాడారు. మహేష్ బాబు కూడా సందీప్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. చిత్ర హీరో రణ్‌బీర్ సింగ్‌ను కూడా పొగిడారు. అయితే, ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఓ పుకారుకు బలం చేకూరింది.
యానిమల్ సినిమాకు సీక్వెల్ ఉండనుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే, 3 గంటలకు పైగా చిత్ర నిడివి ఉండటంతో ఈ ప్రచారానికి బ్రేక్ పడ్డట్టు అయింది. కానీ, తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో భాగంగా దర్శకుడు సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. స్టార్టింగ్..ఎండింగ్ మిస్ అవ్వద్దూ అని అన్నారు. దీంతో సీక్వెల్ ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. యానిమల్ సినిమాకు సీక్వెల్ ఉండబోతోందంటూ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది.
సినిమాకు సీక్వెల్ ఉంటుందన్న కారణంగానే సందీప్ రెడ్డి ఎండింగ్‌ను మిస్ కాకుండా చూడండని చెప్పాడంటున్నారు. అయితే, ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే డిసెంబర్ 1వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. సినిమా విడుదలైన తర్వాత ఎండ్ కార్డును చూస్తే కానీ, సీక్వెల్‌పై ఓ క్లారిటీ రాదు. ఒక వేళ యానిమల్ సినిమాకు సీక్వెల్ ఉంటే.. అది కచ్చితంగా దర్శకుడి సాహసం.. కథ మీద నమ్మకమే అని చెప్పాలి. కాగా, యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌కు జంటగా రష్మిక మందన్నా నటించారు.
అనిల్ కపూర్, బాబీ డియోల్, పృద్ధీ‍్వరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ ప్లాట్ ఫాం ఇప్పటికే ఫిక్స్ అయింది. తెలుగులో ఆహా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. సినిమా విడుదలైన 6 వారాల తర్వాత యానిమల్ ఓటీటీలోకి రానుందట. మరి, యానిమల్ చిత్రానికి సీక్వెల్ ఉన్నట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.