iDreamPost
android-app
ios-app

Triptii Dimri: యానిమల్ మూవీ సెకండ్ హీరోయిన్ బ్యాగ్రౌండ్ తెలుసా?

  • Published Dec 04, 2023 | 1:56 PM Updated Updated Dec 04, 2023 | 1:56 PM

యానిమల్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో రీసౌండింగ్ ఇస్తోంది. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, రష్మికా మందన్నా తర్వాత బాగా పేరొచ్చింది తృప్తీ ధిమ్రీకే మరి.. ఆమె ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో చూద్దాం.

యానిమల్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో రీసౌండింగ్ ఇస్తోంది. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, రష్మికా మందన్నా తర్వాత బాగా పేరొచ్చింది తృప్తీ ధిమ్రీకే మరి.. ఆమె ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో చూద్దాం.

  • Published Dec 04, 2023 | 1:56 PMUpdated Dec 04, 2023 | 1:56 PM
Triptii Dimri: యానిమల్ మూవీ సెకండ్ హీరోయిన్ బ్యాగ్రౌండ్ తెలుసా?

యానిమల్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. తొలి వీకెండ్ లోనే ఈ చిత్రం దాదాపు రూ.356 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్రబృందం ప్రకటించింది. నిజానికి ఇది చిన్న నంబర్ కాదనే చెప్పాలి. బాలీవుడ్ లో మాత్రమే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ మూవీలో రణ్ బీర్ కపూర్, రష్మికా మందన్నాకు ఎంత పేరు వచ్చిందో.. అలాగే తృప్తీ ధిమ్రీకి కూడా అంతే పేరొచ్చింది. అయితే చాలామంది అసలు ఆమె ఎవరు అంటూ వెతుకాలట మొదలు పెట్టేశారు. మరి.. తృప్తి ధిమ్రీ ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్, రష్మికా మందన్నా, అనీల్ కపూర్ క్యారెక్టర్ల తర్వాత బాగా హైలెట్ అయిన పాత్ర జోయాదే. ఆమె ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆమె తిరిగి వెళ్లిపోయే వరకు కూడా ఆమె క్యారెక్టర్ కు ఆడియన్స్ సరెండర్ అయిపోయారు. నిజానికి రష్మికా కంటే కూడా ఇప్పుడు ఈమె కోసమే ఎక్కువ మంది యానిమల్ సినిమాకి రిపీటెడ్ గా వెళ్తున్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఒక్క పాత్రతో కొల్లగొట్టింది. చాలామంది ఈమెకు ఇప్పుడు ఫ్యాన్స్ గా మారిపోయారు. తృప్తీ ధిమ్రీ బాలీవుడ్ లో హీరోయిన్. ఈమె యానిమల్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా కూడా.. గతంలోనే బీటౌన్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించింది మెప్పించింది. అటు సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈమెకు ఏకంగా 12 లక్షల మందికిపై ఫాలోవర్స్ ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

మరోవైపు మోడల్ గా కూడా ఈమె ఫొటోషూట్లు, వెకేషన్ పిక్స్, వీడియోస్, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇంక కెరీర్ విషయానికి వస్తే.. 2017లో శ్రీదేవీ లీడ్ రోల్ ప్లే చేసిన మామ్ సినిమాతో తృప్తీ ధిమ్రీ తన కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత పోస్టర్ బాయ్స్, లైలా మజ్నూ, బుల్ బుల్, ఖాలా, యానిమల్ చిత్రాల్లో నటించింది. అలాగే నాగిన్ సీజన్ 3లో ఒక స్పెషల్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది. బులుబ్బుల్ చిత్రానికి సంబధించి ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డు కూడా దక్కింది. ఇప్పుడు యానిమల్ చిత్రం ఆమె కేరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో వచ్చిన ఆదరణను బట్టి చూస్తే ఆమెకు కచ్చితంగా మళ్లీ టాలీవుడ్ నుంచి అవకాశాలు దక్కుతాయనే చెప్పాలి. అలాగే యానిమల్ 2 సినిమాలో కూడా తృప్తీ ధిమ్రీ పాత్ర ఉండబోతోంది. అలాగే యానిమల్ సినిమాలో ఆమె పాత్ర కీలకంగా మారిన విషయం తెలిసిందే. మరి.. తృప్తీ ధిమ్రీ నటన, యానిమల్ చిత్రంలో పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbenjaminsbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş