iDreamPost
android-app
ios-app

Tripti Dimri: కోహ్లీ బామ్మర్దితో ‘యానిమల్’ బ్యూటీ బ్రేకప్.. సెకండ్ లవ్ అతడితోనే!

  • Published Jan 31, 2024 | 9:07 PM Updated Updated Jan 31, 2024 | 9:07 PM

ఒకే ఒక్క సినిమాతో ఓవర్​నైట్ స్టార్​గా మారిన వారిలో ‘యానిమల్’ ఫేమ్ తృప్తి డిమ్రీ ఒకరు. ఆ మూవీలో తన యాక్టింగ్​తో, కిల్లింగ్ లుక్స్​తో యూత్ హార్ట్​ను బ్రేక్ చేసిందామె.

ఒకే ఒక్క సినిమాతో ఓవర్​నైట్ స్టార్​గా మారిన వారిలో ‘యానిమల్’ ఫేమ్ తృప్తి డిమ్రీ ఒకరు. ఆ మూవీలో తన యాక్టింగ్​తో, కిల్లింగ్ లుక్స్​తో యూత్ హార్ట్​ను బ్రేక్ చేసిందామె.

  • Published Jan 31, 2024 | 9:07 PMUpdated Jan 31, 2024 | 9:07 PM
Tripti Dimri: కోహ్లీ బామ్మర్దితో ‘యానిమల్’ బ్యూటీ బ్రేకప్.. సెకండ్ లవ్ అతడితోనే!

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతుంటారు. అయితే ఒక్క ఆఫర్ దక్కించుకునేందుకు ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆఫర్ వస్తే పెద్ద విషయం కాదు.. గానీ దాన్ని సద్వినియోగం చేసుకొని పేరు తెచ్చుకోవడం, ఆ మీదట కెరీర్​ను పక్కాగా ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. ఓ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు ఇదే పనిలో ఉంది. ఒకే ఒక్క మూవీతో నార్త్​తో పాటు సౌత్​లోనూ పాపులర్ అయిపోయిందా ముద్దుగుమ్మ. ఆమెనే తృప్తి డిమ్రీ. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ ఫిల్మ్​తో యూత్​ హార్ట్​త్రోబ్​గా మారిపోయింది డిమ్రీ. ఆ సినిమాలో ఆమె క్యూట్ యాక్టింగ్, కిల్లింగ్ లుక్స్​తో కోట్లాది మంది ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించింది. అలాంటి ఈ ప్రముఖ నటి పర్సనల్ లైఫ్​కు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ బామ్మర్దికి బ్రేకప్ చెప్పి మరో వ్యక్తితో ఆమె సెకండ్ లవ్​ను స్టార్ట్ చేసిందని తెలుస్తోంది.

‘యానిమల్’తో నేషనల్ క్రష్​గా మారిన తృప్తి డిమ్రీ తన సెకండ్ లవ్​ను షురూ చేసిందట. హోటల్స్​తో పాటు రెస్టారెంట్స్ బిజినెస్​ ఉన్న ప్రముఖ వ్యాపారి సామ్ మర్చంట్​తో ఈ అమ్మడు పీకల్లోతు ప్రేమలో ఉందని తెలుస్తోంది. ప్రియుడికి బర్త్ డే విషెస్ చెబుతూ అతడితో దిగిన రెండు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఒకటి త్రోబ్యాక్ పిక్ కాగా.. మరొకటి ఇటీవలే కలసి దిగిన ఫొటోను పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని వచ్చిన గాసిప్ నిజమేనని తేలిపోయింది. దీంతో ఆమె లవర్ సామ్ మర్చంట్ ఎవరు? అని అందరూ వెతకసాగారు. అయితే రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ బిజినెస్​లో అతడు పేరు గడించాడని తెలుస్తోంది. లగ్జరీ వీఐపీ బిల్డింగ్స్, గోవాలో రెస్టారెంట్లు, క్లబ్​లు అతడికి ఉన్నాయట. ఈ బిజినెస్ కంటే ముందు సామ్ మర్చంట్ మోడల్​గా పనిచేశాడట.

'Animal' beauty second love

హోటల్ బిజినెస్ రన్ చేస్తున్న సామ్ మర్చంట్ ఓ ట్రావెల్ బ్లాగర్ అని కూడా తెలిసింది. ఇన్​స్టాగ్రామ్​లో అతడికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా తృప్తి డిమ్రీతో లవ్ మ్యాటర్ బయటకు రావడంతో అతడి గురించి మూవీ లవర్స్ తెలుసుకోవడం మొదలుపెట్టారు. దీంతో సోషల్ మీడియాలోనూ సామ్ మర్చంట్ పేరు బాగా వినిపిస్తోంది. ఇక, తృప్తి ఖాతాలో ఇతను సెకండ్ బాయ్​ఫ్రెండ్ కావడం గమనార్హం. ఇతడి కంటే ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మతో ఆమె కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని ‘యానిమల్’ బ్యూటీ అధికారికంగానూ ప్రకటించింది. కానీ ఆ రిలేషన్ చాన్నాళ్లు కొనసాగలేదు. ఇన్​స్టాలో వాళ్లు ఒకర్నొకరు అన్​ఫాలో చేసుకోవడంతో బంధం వీగిపోయిందని తేలిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు సామ్ మర్చంట్​కు ఆమె దగ్గరయినట్లుగా సమాచారం. మరి.. తృప్తి డిమ్రీ సెకండ్ లవ్ న్యూస్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetbetsmoveMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabet girişHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbet