iDreamPost
android-app
ios-app

యాంకర్ సుమ తాతయ్యకు అరుదైన గౌరవం.. ఏకంగా గిన్నిస్ రికార్డు!

  • Published Nov 09, 2023 | 1:42 PM Updated Updated Nov 09, 2023 | 1:42 PM

తెలుగు బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో కోట్ల మంది అభిమానం సంపాదించారు సుమా కనకాల. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో పాటు అప్పుడప్పుడు వెండి తెరపై నటిస్తున్నారు. 20 ఏళ్లుగా బుల్లితెరపై ఎదో రకంగా ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు.

తెలుగు బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో కోట్ల మంది అభిమానం సంపాదించారు సుమా కనకాల. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో పాటు అప్పుడప్పుడు వెండి తెరపై నటిస్తున్నారు. 20 ఏళ్లుగా బుల్లితెరపై ఎదో రకంగా ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు.

  • Published Nov 09, 2023 | 1:42 PMUpdated Nov 09, 2023 | 1:42 PM
యాంకర్ సుమ తాతయ్యకు అరుదైన గౌరవం.. ఏకంగా గిన్నిస్ రికార్డు!

తెలుగు బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు వచ్చినా.. సుమా కనకాల యాంకరింగ్ ఓ ప్రత్యేకం అంటారు. ఆమె డేట్స్ కోసం కొన్ని ఈవెంట్స్ డేట్స్ మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు యంకర్ సుమ యాంకరింగ్ కొంతమంది సినీ సెలబ్రెటీలకు సెంటిమెంట్ అని అంటారు. అందుకే బుల్లితెరపై రానాణిగా తన యాంకరింగ్ తో స్టార్‌డమ్ సంపాదించింది. ఇప్పటి వరకు ఎన్నో వేల షోలకు యాంకరింగ్ గా చేసిన సుమా కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అచ్చమైన కేరళా అమ్మాయి అయినప్పటికీ.. సుమ తెలుగు అనర్ఘళంగా మాట్లాడుతుంది. కెరీర్ బిగినింగ్ లో బుల్లితెరపై సీరియల్స్ లో నటించిన సుమ.. తన సహనటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకొని హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. తాజాగా యాంకర్ సుమ తన తాతయ్య గురించి ఓ పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే..

సుమా కనకాల బుల్లితెరపై 20 ఏళ్లుగా తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. యాంకర్ గానే కాకుండా పలు టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో పాటు అప్పుడప్పుడు వెండి తెరపై నటిస్తూ.. ఏదో రకంగా ఆడియన్స్ ని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే యాంకర్ సుమ తన కుటుంబ సభ్యుల విషయాలు అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే తన తాతయ్య గురించి ఓ పోస్ట్ చేశారు. సుమ అమ్మమ్మ సోదరుడు పి బాలసుబ్రమణ్యన్ మీనన్ 98 ఏళ్ల వయసులో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. 73 ఏళ్లుగా ఆయన లాయర్ ప్రొఫేషన్ లో కొనసాగుతూ వచ్చి ఏకంగా వరల్డ్ రికార్డు సృష్టించారు. ఈ విషయం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు దృష్టిలోకి రావడంతో ఆయనకు అవార్డు అందించారు. ఈ విషయం గురించి యాంకర్ సుమ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల కెరీర్ బిగినింగ్ లో కొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు. తర్వాత విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. ఇక సుమా కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా మూవీస్ ని తెరకెక్కించిన రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా ‘బబుల్ గమ్’ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రోషన్ సరసన మానసా చౌదరి నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 29 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల రిలజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom