iDreamPost
android-app
ios-app

వీడియో: తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రముఖ యంకర్ దివ్య!

Anchor Divya: ఇటీవల సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ప్రముఖ యాంకర్ తండ్రి మృతి చెందారు. ఈ క్రమంలో తన తండ్రికి ఆ యంకరే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించింది.

Anchor Divya: ఇటీవల సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ప్రముఖ యాంకర్ తండ్రి మృతి చెందారు. ఈ క్రమంలో తన తండ్రికి ఆ యంకరే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించింది.

వీడియో: తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రముఖ యంకర్ దివ్య!

సాధారణంగా ఎవరైనా మరణిస్తే వారు వారసులు అంత్యక్రియలు నిర్వహిస్తారు.  కొడుకులు ఉన్న వాళ్లు  తల్లిదండ్రులకు తలకొరివి పెడుతుంటారు. అయితే కొన్ని సార్లు కుమార్తెలే తమ కన్నవారికి చితిపెడుతుంటారు. కొడుకులు ఉన్నా పట్టించుకోక కొందరు, అసలు పుత్రులే లేక మరికొందరికి వారి కుమార్తెలు అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. ఇలా కేవలం సామాన్యులు మాత్రమే కాదు..సినీ, రాజకీయ సెలబ్రిటీలు కూడా చేస్తుంటారు. ఎంతో మంది సెలబ్రిటీలైన మహిళలు..వారి కన్నవారికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటనలు  చాలానే చూశాం. తాజాగా ఓ ప్రముఖ యాంకర్ కూడా తన కన్నతండ్రికి తలకొరివి పెట్టింది.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రముఖ కన్నడ యాంకర్ దివ్య ఆలూర్ గురించి..అక్కడి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించి..మంచి గుర్తింపు సంపాదించింది. అంతేకాక తనదైన మాటలతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇది ఇలా ఉంటే..ఆమె ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి, జానపద గాయకుడు, రచయిత ఆలూర్ నాగప్ప కన్నుమూశారు.

కొంతకాలంగా వృద్ధాప్యంతో నాగప్ప ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఆయన కన్నుమూశారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన అనేక పాటలు రాయడమే కాకుండా, జానపద పాటలను పాడే వారు. ఇక ఆయనకు కొడుకులు లేకపోవడంతో.. యాంకర్ దివ్యానే తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. దివ్య స్వయంగా అంతిమ సంస్కారాలు చేసి పలువురు మెచ్చుకున్నారు. వృద్ధాప్యం, అలానే పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నాగప్ప కొద్దిరోజులుగా బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలా చికిత్స పొందుతూ బుధవారం నాగప్ప మృతి చెందారు.

ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలు బిడాడి సంక్షేమ గౌడ్‌కు చెందిన దొడ్డిలో నిర్వహించారు. దీనిపై ఓ పోస్ట్‌ను దివ్య షేర్ చేశారు. అందులో తన తండ్రి గురించి ఆమె ప్రస్తావించింది. తన తండ్రి ఇకలేరని నిజాన్ని జీర్ణించుకోలేపోతున్నట్లు తెలిపింది. ఆయన మరణం ప్రజలకు పెద్ద లోటు అని తెలిపింది. ఇంతకాలం దేశమంతటా వినిపించిన కన్నడ గొంతు నిశ్శబ్ధంగా మారిందని ఆమె అన్నారు. ఇది ఇలా ఉంటే.. తన తండ్రికి అంత్యక్రియలు చేయడంతో దివ్యపై పెద్ద సంఖ్యలో ప్రశంసలు వెల్లువెత్తాయి. కన్నవారికి వారసులు అంటే కేవలం మగపిల్లలే కాదని, ఆడపిల్లలు కూడా అంటూ కొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. నాగప్ప మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేశారు. అలానే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Divya Alur Official (@divyaalurofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి