iDreamPost
android-app
ios-app

పుష్ప 2 నుండి అనసూయ ఫస్ట్ లుక్ .. పవర్ ఫుల్ లేడీగా

  • Published May 16, 2024 | 11:51 AM Updated Updated May 16, 2024 | 12:41 PM

బుల్లితెరపై తన యాంకరింగ్ తో కట్టిపడేసిన ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. వెండితెరపై గుర్తిండిపోయే పాత్రలతో అభిమానులకు మరింత చేరువౌతుంది. తాజాగా ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని పుష్ప 2 నుండి ఫస్ల్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్

బుల్లితెరపై తన యాంకరింగ్ తో కట్టిపడేసిన ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. వెండితెరపై గుర్తిండిపోయే పాత్రలతో అభిమానులకు మరింత చేరువౌతుంది. తాజాగా ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని పుష్ప 2 నుండి ఫస్ల్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్

  • Published May 16, 2024 | 11:51 AMUpdated May 16, 2024 | 12:41 PM
పుష్ప 2 నుండి అనసూయ ఫస్ట్ లుక్ .. పవర్ ఫుల్ లేడీగా

బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చి నిరూపించుకుంటోన్న నటి అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ షోతో యాంకర్‌గా ప్రయాణం మొదలు పెట్టిన అనసూయ.. తొలుత చిన్న చిన్న పాత్రల్లో మెరిచింది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్, ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటించింది. ఆమెకు పేరు తెచ్చింది మాత్రం రంగమ్మత్త క్యారెక్టర్. 2018లో సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలంతో.. రంగమ్మత్తగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. ఈ సినిమాలో ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించింది.ఇక సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్పతో ఆమెకు గ్లోబల్ లెవెల్ గుర్తింపు దక్కింది. ఇందులో సునీల్ భార్యగా, దాక్షాయణి పాత్రలో మెప్పించిన సంగతి విదితమే.

ఇప్పుడు పుష్ప 2లో కూడా నటిస్తోంది. మే 15న ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో ఆమెను రఫ్ లుక్‌లో చూపించాడు దర్శకుడు. మంచి చీర కట్టి.. నడుముకు వడ్డాణం చుట్టి.. ఎర్ర చందనం స్టాక్ చేసిన చోట.. ఓ చెక్కపై కూర్చుని కాలుమీద కాలువేసుకుని.. నోట్లో ఏదో నలుముతూ కనిపిస్తోంది ఈ బ్యూటీ. రియాలిటీకి.. రీల్ లైఫ్‌కు ఆమడ దూరంలో కనిపిస్తుంది ఈ స్టార్ యాంకరమ్మ. దీని బట్టి చూస్తే సునీల్ కన్నా ఈమె పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు అనిపిస్తోంది. ఆమె భర్త మంగళం శ్రీను (సునీల్ పాత్ర)కన్నా దాక్షాయణి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండబోతుందనుకుంటా. ఈ సారి అల్లు అర్జున్‌తో ఢీ కొట్టే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అదే అయితే ఈసారి అనసూయ..దాక్షాయణి రోల్‌లో కొన్ని సంవత్సరాల పాటు గుర్తిండిపోవడం గ్యారెంటీ.

పవర్ ఫుల్ లేడీగా కనిపించబోతుంది అనసూయ భరద్వాజ్. ఇక ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేసేందుకు సిద్దం అయ్యింది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే..ఈ సినిమా నుండి గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక్కటిగా విడుదల చేస్తూ ఉన్నారు. బన్నీ పుట్టిన రోజున.. అమ్మవారి పాత్రలో ఉన్న అల్లు అర్జున్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత పుష్ప నుండి పుష్ప.. పుష్ప, పుష్ప రాజ్ అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఇది యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగించిన సంగతి విదితమే. ఇక బన్నీ హుక్స్ స్టెప్పులకు అయితే ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. హీరోయిన్ రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజైంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నవీన్ ఏర్నేనీ, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఫహాద్ ఫజిల్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రావు రమేశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు

 

View this post on Instagram

 

A post shared by Pushpa (@pushpamovie)

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş