Nidhan
Anant Ambani-Radhika Merchant: అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు తరలివస్తున్నారు.
Anant Ambani-Radhika Merchant: అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు తరలివస్తున్నారు.
Nidhan
అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ముంబై నగరంలోని జియో వరల్డ్ సెంటర్లో జరుగుతున్న ఈ సెర్మనీకి దేశవిదేశాల నుంచి పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు తరలివస్తున్నారు. క్రికెటర్లు, సినీ నటులు, వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నేతలు.. ఇలా అందరూ ఈ మ్యారేజ్ కోసం ముంబైకి చేరుకున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ కూడా అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కూడా జియో వరల్డ్ సెంటర్‌కు వచ్చారు. ఫ్యామిలీతో సహా ఈ ఫంక్షన్‌కు ఆయన అటెండ్ అయ్యారు.
సతీమణి నమ్రత, కూతురు సితారతో కలసి అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలో మెరిశారు మహేష్. నమ్రత-సితార ఒకే రంగు బట్టల్లో తళుక్కుమన్నారు. సూపర్‌స్టార్ బ్లూ కలర్ షేర్వాణీతో ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచారు. కొత్త లుక్‌లో అందర్నీ అట్రాక్ట్ చేశారు మహేష్. లాంగ్ హెయిర్, మీసాలు, గడ్డంతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. ఈ ఈవెంట్లో మహేష్ ఫ్యామిలితో దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్.. సూపర్ స్టార్ లుక్ కెవ్వు కేక అని అంటున్నారు. దర్శక ధీరుడు రాజమౌళితో మూవీలో ఈ లుక్‌తో కనిపిస్తే స్క్రీన్స్ బద్దలవ్వాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు.
రాజమౌళి మూవీ కోసం కండలు పెంచుతున్నారు మహేష్. అయితే అంబానీ మ్యారేజ్ ఫంక్షన్లో షేర్వాణీలో దర్శనమిచ్చి కండలు కనిపించకుండా జాగ్రత్తలు పడ్డారు. ఒకవైపు మహేష్ తన లుక్ కోసం బాడీతో పాటు గడ్డం, మీసాలు పెంచడం, మరోవైపు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో జక్కన్న బిజీగా ఉండటంతో సినిమా ఇంకెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో క్లారిటీ రావడం లేదు. కథ, కథనాలు ఓకే అవడం, లొకేషన్స్‌తో పాటు కాస్టింగ్, మిగతా పనులు కూడా ముగిసినా ఇంకా పూజా కార్యక్రమాలు మొదలవకపోవడానికి ఆషాఢమాసం కారణమని టాక్ నడుస్తోంది. ఆషాఢమాసంలో ముహూర్తాలు ఉండవు కాబట్టి కొత్త పనులు ఏవీ స్టార్ట్ చేయొద్దనే సెంటిమెంట్‌తో షూటింగ్ డేట్‌ను వాయిదా వేశారని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరి.. మహేష్ న్యూ లుక్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
#MaheshBabu and #NamrataShirodkar arrive at #RadhikaMerchant and #AnantAmbani‘s wedding today.#Trending #FilmfareLens pic.twitter.com/yn6DxAi7Bi
— Filmfare (@filmfare) July 12, 2024